రైతులను ఆదుకోవాలి: తమ్మినేని

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: భారీ వర్షాల కారణంగా నష్టపోయిన పత్తి, వరి రైతులకు ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. బుధవారం ఆయన ఖమ్మం జిల్లాలోని గోదావరి ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ముందుగా తూర్పు బాక పంచాయతీ పరిధిలో నీటమునిగిన పత్తి చేలను పరిశీలించారు. అనంతరం రేగుబల్లి, కాశీనగరంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీట మునిగిన పత్తి పంటలకు ఎకరాకు రూ.15 వేలు, […]

Update: 2020-08-19 06:20 GMT

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: భారీ వర్షాల కారణంగా నష్టపోయిన పత్తి, వరి రైతులకు ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. బుధవారం ఆయన ఖమ్మం జిల్లాలోని గోదావరి ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ముందుగా తూర్పు బాక పంచాయతీ పరిధిలో నీటమునిగిన పత్తి చేలను పరిశీలించారు. అనంతరం రేగుబల్లి, కాశీనగరంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీట మునిగిన పత్తి పంటలకు ఎకరాకు రూ.15 వేలు, వరి అయితే ఎకరాకు రూ.10 వేల నష్టపరిహారం ఇవ్వాలన్నారు. గోదావరి ముంపు ప్రాంత రైతులకు సీపీఎం పార్టీ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు అన్నవరపు కనకయ్య, నున్న నాగేశ్వరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు యలమంచి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News