ఆర్ధిక సాయం అంద‌జేసిన తలసాని సాయికిర‌ణ్

దిశ ప్ర‌తినిధి, హైద‌రాబాద్: సనత్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని రాంగోపాల్ పేట, మోండా మార్కెట్, బన్సీలాల్‌పేట డివిజన్‌లలో వరద బాధితులకు టీఆర్ఎస్ నేత తలసాని సాయి కిరణ్ రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. కార్పొరేటర్లు అత్తిలి అరుణ గౌడ్, ఆకుల రూప, కుర్మ హేమలత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయి కిరణ్ మాట్లాడుతూ వరద ముంపుకు గురైన ఒక్కో కుటుంబానికి రూ.10వేలు, పూర్తిగా కూలిపోయిన ఇంటికి రూ.లక్ష, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.50వేల చొప్పున […]

Update: 2020-10-29 06:27 GMT

దిశ ప్ర‌తినిధి, హైద‌రాబాద్: సనత్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని రాంగోపాల్ పేట, మోండా మార్కెట్, బన్సీలాల్‌పేట డివిజన్‌లలో వరద బాధితులకు టీఆర్ఎస్ నేత తలసాని సాయి కిరణ్ రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. కార్పొరేటర్లు అత్తిలి అరుణ గౌడ్, ఆకుల రూప, కుర్మ హేమలత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయి కిరణ్ మాట్లాడుతూ వరద ముంపుకు గురైన ఒక్కో కుటుంబానికి రూ.10వేలు, పూర్తిగా కూలిపోయిన ఇంటికి రూ.లక్ష, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.50వేల చొప్పున ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. రహదారుల మరమ్మతులు, డ్రైనేజీ వ్యవస్థ పునరుద్దరణ, పారిశుధ్య పనులు ఎంతో వేగంగా జరుగుతున్నాయని చెప్పారు.

Tags:    

Similar News