అమ్మను అలా ఆటపట్టిస్తుంట : తాప్సీ

తాప్సీ పన్ను.. బాలీవుడ్ లోకి అడుగుపెట్టి వరుస హిట్లతో దూసుకుపోతుంది. తాజాగా తప్పడ్ సినిమాతో హిట్ అందుకున్న తాప్సీ.. తల్లిని ఎలా ఫూల్ చేస్తుందో అభిమానులకు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. మీరు ఇంట్లో ట్రై చేయొచ్చు అని చెప్తోంది.   View this post on Instagram   Picture u send to your mom to scare the sh*t out of her ! Lol This one was […]

Update: 2020-05-11 05:12 GMT

తాప్సీ పన్ను.. బాలీవుడ్ లోకి అడుగుపెట్టి వరుస హిట్లతో దూసుకుపోతుంది. తాజాగా తప్పడ్ సినిమాతో హిట్ అందుకున్న తాప్సీ.. తల్లిని ఎలా ఫూల్ చేస్తుందో అభిమానులకు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. మీరు ఇంట్లో ట్రై చేయొచ్చు అని చెప్తోంది.

తన సినిమాలో ఫైట్ సీక్వెన్స్ తర్వాత గాయాలతో ఉన్న మొహాన్ని ఫోటో తీసి అమ్మకు సెండ్ చేస్తానని తెలిపింది తాప్సీ. కానీ అది మేక్ అప్ అని తెలియక అమ్మ చాలా భయపడిన రోజులు ఉన్నాయని చెప్తోంది. చాలా సార్లు ఇలాగే అమ్మను ఆటపట్టించాను అంటోంది తాప్సీ. అంతే కాదు చిన్నప్పుడు స్కూల్ కు వెళ్ళకుండా ఇంటిలోనే ఉండి ఆడుకోవాలని అనుకున్నా కూడా ఇదే ట్రిక్ ఫాలో అయ్యేదట. దీంతో స్కూల్ డుమ్మా కొట్టేందుకు సపరేట్ గా పొద్దు పొద్దున్నే కథలు అల్లాల్సిన అవసరం లేకుండా పోయేదని చెప్పింది.

ఈ పోస్ట్ పై స్పందించిన తాప్సీ చెల్లెలు షాగన్.. నేను కూడా చిన్నప్పుడు అక్క దారిలోనే నడిచేదాన్ని అంటోంది. అక్క అలా చేసినప్పుడు నేను చేయకుండా ఉంటే ఏం బాగుంటుంది.. అందుకే నేను తన నుంచే ఈ పాఠాలు నేర్చుకుని ఫాలో అయిపోతున్నానని చెప్తోంది

Tags:    

Similar News