ఈ ఏడాదే బికినీలో దర్శనమిస్తా : స్వరా భాస్కర్

దిశ, సినిమా : బాలీవుడ్‌లో యూనిక్ రోల్స్ ప్లే చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న నటి స్వరా భాస్కర్. ‘తను వెడ్స్ మను’ చిత్రంలో ఆమె పోషించిన సపోర్టింగ్ రోల్‌కు విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా దక్కాయి. ఇక పొలిటికల్ ఇష్యూస్‌పై ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలు పంచుకునే ఈ భామ.. ఈ రోజు(శుక్రవారం) పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ మేరకు ఇండస్ట్రీ ప్రముఖులు, ఫ్యాన్స్ ఆమెకు విషెస్ చెప్తుండగా.. తన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి ఫ్యాన్స్‌కు వివరించింది స్వర. డిఫరెంట్ […]

Update: 2021-04-09 03:12 GMT

దిశ, సినిమా : బాలీవుడ్‌లో యూనిక్ రోల్స్ ప్లే చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న నటి స్వరా భాస్కర్. ‘తను వెడ్స్ మను’ చిత్రంలో ఆమె పోషించిన సపోర్టింగ్ రోల్‌కు విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా దక్కాయి. ఇక పొలిటికల్ ఇష్యూస్‌పై ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలు పంచుకునే ఈ భామ.. ఈ రోజు(శుక్రవారం) పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ మేరకు ఇండస్ట్రీ ప్రముఖులు, ఫ్యాన్స్ ఆమెకు విషెస్ చెప్తుండగా.. తన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి ఫ్యాన్స్‌కు వివరించింది స్వర.

డిఫరెంట్ జోనర్ మూవీస్ చేసిన తను, కొవిడ్ కట్టడికి విధించిన లాక్ డౌన్ టైమ్‌లో ఖాళీగా గడపకుండా రెండు స్క్రిప్ట్‌లు రాసుకున్నానని, త్వరలో వాటి గురించి అఫీషియల్‌గా అనౌన్స్‌ చేస్తానని పేర్కొంది. తనకు బికినీ ధరించాలని ఉందని, అందుకు తగ్గ బాడీ ఫిట్‌నెస్ కోసం ప్రయత్నిస్తున్నానని చెప్పింది. తన హెల్తీయెస్ట్ వెర్షన్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించింది. అంతేకాదు ఈ ఏడాదిలోనే బికినీ సూట్‌లో అందరికీ దర్శనమివ్వబోతున్నట్లు తెలిపింది.

Tags:    

Similar News