ఇంటి యజమాని కోసం పాముతో పోరాడి ప్రాణాలొదిలిన కుక్క

దిశ, ఏపీ బ్యూరో: కుక్క విశ్వాసానికి పెట్టింది పేరు అని చెప్తూ ఉంటారు. అందుకే కుక్కను పెంచేందుకు చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. ఆ కుక్క విశ్వాసం చూపించడమే కాదు తమ యజమానికి ఏమైనా హాని జరిగినా తట్టుకోలేదు. యజమాని కోసం అవసరమైతే శత్రువులతో పోరాటం సైతం చేస్తోంది. కొన్ని సందర్భాల్లో యజమాని కోసం తన ప్రాణాలను సైతం ఇచ్చేస్తోంది. ఇవన్నీ సినిమాల్లో చూస్తూనే ఉంటాం. అలాంటి నిజమైన ఘటన ఒకటి కృష్ణా జిల్లా నందిగామలో చోటు […]

Update: 2021-12-27 03:12 GMT

దిశ, ఏపీ బ్యూరో: కుక్క విశ్వాసానికి పెట్టింది పేరు అని చెప్తూ ఉంటారు. అందుకే కుక్కను పెంచేందుకు చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. ఆ కుక్క విశ్వాసం చూపించడమే కాదు తమ యజమానికి ఏమైనా హాని జరిగినా తట్టుకోలేదు. యజమాని కోసం అవసరమైతే శత్రువులతో పోరాటం సైతం చేస్తోంది. కొన్ని సందర్భాల్లో యజమాని కోసం తన ప్రాణాలను సైతం ఇచ్చేస్తోంది. ఇవన్నీ సినిమాల్లో చూస్తూనే ఉంటాం. అలాంటి నిజమైన ఘటన ఒకటి కృష్ణా జిల్లా నందిగామలో చోటు చేసుకుంది.

తాను కాపలాగా ఉన్న ఇంటిలోకి తాచుపాము రావడంతో ఆ కుక్క ఊరుకోలేదు. కన్నంలోకి దూరిన పామును మరీ బయటకు తీసి పోరాడింది. తమ యజమానులకు ఎక్కడ హాని చేస్తుందనే ఉద్దేశంతో దాన్ని చంపేసింది. ఆ విషపు పాముతో పోరాడి చివరకు ఆ కుక్క కూడా ప్రాణాలొదిలింది. రాట్ వీలర్ అనే సంతతికి చెందిన ఈ కుక్కను యజమాని గత కొన్నాళ్లుగా పెంచుకుంటున్నారు. దీంతో తమను కాపాడేందుకు ఇలా ప్రాణాలొదిలిందని తలచుకుని ఇంటి యజమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News