పబ్లిక్​ పల్స్​.. సర్వేలో ఆసక్తికర వివరాలు

ఏ పార్టీ గెలుస్తుంది.. ఏ నాయకుడికి ఓటేస్తావ్​.. అభివృద్ధి ఎంతమేర జరిగింది..? గతంలో గెలిచిన నాయకుడిలోని లోపాలేంటి..? వంటి వివరాల సేకరణకు సర్వే సంస్థలు విస్తృతంగా పర్యటిస్తున్నాయి.. గ్రేటర్​లో పార్టీల బలాబలాలు తెలుసుకోవడానికి, ఓటరు నాడిని పట్టుకోవడానికి డోర్​ టు డోర్​ తిరుగుతున్నాయి.. ఈ సర్వేలతో కొందరు యువతకు ఉపాధి లభిస్తుండగా, కొన్ని పార్టీలు, నాయకుల బలాలుబలహీనతలు తేలిపోతున్నాయి. దిశ, తెలంగాణ బ్యూరో : రెండోసారి బల్దియా ఎన్నికలు జరుగుతున్నాయి. గెలుపెవరిది అంటూ ప్రజాభిప్రాయ సేకరణ భారీగా […]

Update: 2020-11-19 22:55 GMT

ఏ పార్టీ గెలుస్తుంది.. ఏ నాయకుడికి ఓటేస్తావ్​.. అభివృద్ధి ఎంతమేర జరిగింది..? గతంలో గెలిచిన నాయకుడిలోని లోపాలేంటి..? వంటి వివరాల సేకరణకు సర్వే సంస్థలు విస్తృతంగా పర్యటిస్తున్నాయి.. గ్రేటర్​లో పార్టీల బలాబలాలు తెలుసుకోవడానికి, ఓటరు నాడిని పట్టుకోవడానికి డోర్​ టు డోర్​ తిరుగుతున్నాయి.. ఈ సర్వేలతో కొందరు యువతకు ఉపాధి లభిస్తుండగా, కొన్ని పార్టీలు, నాయకుల బలాలుబలహీనతలు తేలిపోతున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో : రెండోసారి బల్దియా ఎన్నికలు జరుగుతున్నాయి. గెలుపెవరిది అంటూ ప్రజాభిప్రాయ సేకరణ భారీగా నడుస్తోంది. నగరవ్యాప్తంగా పలు పలు ప్రైవేటు ఏజెన్సీలు, సర్వే, స్వచ్ఛంద సంస్థలు విస్తృతంగా సర్వేలు చేస్తున్నాయి. వారం రోజులుగా ఈ తంతు నడుస్తోంది. సంస్థల ప్రతినిధులు గుర్తింపు కార్డులు పట్టుకొని ఇంటింటికీ తిరుగుతున్నారు. వందలాది మంది యువతకు కూడా చేతి నిండా పని దొరికింది. ఓటరు జాబితాల ఆధారంగా ఈ ప్రక్రియ నడుస్తోంది. చాలా సంస్థలు ట్యాబ్‌ల్లోనే అభిప్రాయ సేకరణను నిక్షిప్తం చేస్తున్నాయి. అందుకోసం ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ను తయారు చేసుకున్నాయి.

ఆసక్తికరంగా సర్వేలోని వివరాలు..

ప్రస్తుతం గ్రేటర్‌ హైదరాబాద్‌పైనే దేశంలోని అనేక సంస్థలు దృష్టి సారించాయి. సర్వేలో ఆసక్తికరమైన విషయాలు పొందుపర్చినట్టు తెలుస్తోంది. పలు ఇంట్రెస్టింగ్​ ఇష్యూస్ తో ఓటర్​ అంతరంగాన్ని పట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. డిసెంబర్​ 1వ తేదీన ఏ ప్రాతిపదికన ఓటెయ్యాలో నిర్ణయించుకోవడానికి దోహదపడే విధంగా ఉన్నది. చాలా సర్వేలు పార్టీల కోసం చేసేవే కానీ ఈ విడత గ్రేటర్​లో చేసే పలు సర్వేలు ఓటర్లను ఆలోచింపజేసేవిగా, ఎవరికి ఓటేస్తే మంచిందనే విషయాలు తెలియజెప్పేదిగా ఉందని పలువురు పేర్కొంటున్నారు. సుదీర్ఘ అనుభవం కలిగిన సంస్థలు అభ్యర్థులకు, పార్టీలకు పని చేస్తున్నాయి. ఎన్నికల కోలమానంగా సర్వేలు నిర్వహిస్తున్నాయి.

వివిధ రకాల సేవలు..

గతంలో ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల సందర్భంలో సర్వే సంస్థలకు చేతినిండా పని ఉండేది.. ఇప్పుడు బల్దియా ఎన్నికల్లోనూ సర్వేలు ఎక్కువయ్యాయి. ఒక్కో డివిజన్ లో 50 వేలకు పైగా ఓటర్లు ఉండడంతో గెలుపునకు కావాల్సిన అంశాలపై అభ్యర్థులు, పార్టీలు దృష్టి పెట్టారు. డేటా కలెక్షన్లు, టెలిఫోనిక్ సర్వేలు, ఆన్ లైన్ సర్వేలు, పుష్ అండ్ పుల్ ఎస్ఎంఎస్ లు, వాట్సాప్ మెసేజ్​లు, ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రాం, యూట్యూబ్ వంటి సోషల్ మీడియాలతో అభ్యర్థుల గెలుపునకు అవసరమైన సేవలను అందిస్తున్నాయి. కాల్ సెంటర్, ఐవీఆర్, ఎస్ఎంఎస్, స్క్రిప్టింగ్, సోషల్ మీడియా పేజీల సృష్టి, సర్వే డాక్యుమెంట్ డిజైనింగ్ సర్వీసెస్ వంటి అనేకం అందుబాటులోకి వచ్చాయి.

ఓట్ల పండుగ..

సంక్రాంతి, దసరా, దీపావళి.. ఇవన్నీ ఒకటీ రెండు రోజుల పండుగ. కానీ.. ఎన్నికలంటే అందరికీ పండుగే. అది కూడా ఒకటీ రెండు రోజులది కాదు. పది రోజుల పాటు పేద, మధ్య తరగతి వర్గాలకు ఉపాధి కల్పించేది. ఎవరు చేయగలిగిన పని వారికి లభిస్తోంది. జెండాలు, ఫ్లెక్సీలు, బ్రోచర్లు, వాల్‌ పోస్టర్ల ప్రింటింగ్‌, అతికించడం, కట్టడం వంటి పనులు, టోపీలు, జెండాలు కుట్టే పనులు విస్తృతంగా ఏర్పడ్డాయి. అలాగే నిరుద్యోగ యువతకు చేతి నిండా పని దొరికింది. కాస్త ట్యాబ్‌ను ఆపరేట్‌ చేయగలిగితే రోజుకు రూ.1000కి పైగా సంపాదించే మార్గం సర్వేల ద్వారా ఏర్పడింది.

Tags:    

Similar News