యాచకుల కోసం పోలీసుల సర్వే

దిశ, న్యూస్‌బ్యూరో: అనథాలు, భిక్షాటన చేసి కడుపు నింపుకునే వారికి లాక్‌డౌన్‌తో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సాధారణ రోజుల్లో వీధుల్లో ఇంటింటికీ తిరిగి భిక్షమెత్తుకుని పూటగడుపుకునే వారు ప్రస్తుతం ఆకలితో అలమటిస్తున్నారు. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా లాక్‌డౌన్‌ అమలోకి రావాడంతో.. యాచకులను ఎవరు ఇంటి ముందుకు రానివ్వడం లేదు. దేవాలయలు, రోడ్ల పైకి ప్రజలు రాకపోవడంతో దానం చేసేవారు లేక కడుపు మాడ్చుకుని ఏది దొరికితే అది తిని కాలం వెల్లదీస్తున్నారు. దీంతో ప్రభుత్వం బెగ్గర్స్‌ను గుర్తించి […]

Update: 2020-03-28 07:49 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: అనథాలు, భిక్షాటన చేసి కడుపు నింపుకునే వారికి లాక్‌డౌన్‌తో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సాధారణ రోజుల్లో వీధుల్లో ఇంటింటికీ తిరిగి భిక్షమెత్తుకుని పూటగడుపుకునే వారు ప్రస్తుతం ఆకలితో అలమటిస్తున్నారు. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా లాక్‌డౌన్‌ అమలోకి రావాడంతో.. యాచకులను ఎవరు ఇంటి ముందుకు రానివ్వడం లేదు. దేవాలయలు, రోడ్ల పైకి ప్రజలు రాకపోవడంతో దానం చేసేవారు లేక కడుపు మాడ్చుకుని ఏది దొరికితే అది తిని కాలం వెల్లదీస్తున్నారు. దీంతో ప్రభుత్వం బెగ్గర్స్‌ను గుర్తించి వారిని ఆదుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. వీరి కోసం పోలీసు యంత్రాంగం, జీహెచ్ఎంసీ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. భిక్షాటన చేసేవారిని ఒకచోటుకు చేర్చి వసతి కల్పించేందుకు చర్యలు చేపట్టారు. రెండు రోజుల నుంచి సర్వే జరుగుతోంది. ఆదివారం వరకు హైదరాబాద్ మహానగరంలో ఎంతమంది బెగ్గర్స్ ఉన్నారు అన్న సంఖ్య తేలనుంది. వీరినంత ఒకచోటుకు చేర్చి అధికారులు భోజన వసతి, నిద్రపోయేందుకు షెల్టర్ కల్పించనున్నారు.

Tags: streets temples, Survey of beggars, Hyderabad

Tags:    

Similar News