చెస్ట్ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం లేదు: సూపరింటెండెంట్

దిశ, వెబ్‌డెస్క్: ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రిలో జవహర్‌నగర్ వాసి చనిపోయిన ఘటనలో వైద్యుల నిర్లక్ష్యం లేదని సూపరింటెండెంట్ మహబూబ్‌ఖాన్ అన్నారు. కరోనాతో యువకుల్లో గుండెపై ప్రభావం పడుతుందని ఆయన తెలిపారు. హార్ట్ ఇన్వాల్వ్ అయితే ఆక్సిజన్ పెట్టినా ప్రయోజనం ఉండదని, అతని విషయంలో అదే జరిగిందని సూపరింటెండెంట్ స్పష్టం చేశారు. ఘటనలో వైద్యుల నిర్లక్ష్యం ఉందని అనడం సరికాదన్నారు. 11 ఆస్పత్రులు తిరిగినా పట్టించుకోలేదు: తండ్రి ఈనెల 24న మా అబ్బాయికి జ్వరం వచ్చిందని, దాదాపు 11 […]

Update: 2020-06-28 05:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రిలో జవహర్‌నగర్ వాసి చనిపోయిన ఘటనలో వైద్యుల నిర్లక్ష్యం లేదని సూపరింటెండెంట్ మహబూబ్‌ఖాన్ అన్నారు. కరోనాతో యువకుల్లో గుండెపై ప్రభావం పడుతుందని ఆయన తెలిపారు. హార్ట్ ఇన్వాల్వ్ అయితే ఆక్సిజన్ పెట్టినా ప్రయోజనం ఉండదని, అతని విషయంలో అదే జరిగిందని సూపరింటెండెంట్ స్పష్టం చేశారు. ఘటనలో వైద్యుల నిర్లక్ష్యం ఉందని అనడం సరికాదన్నారు.

11 ఆస్పత్రులు తిరిగినా పట్టించుకోలేదు: తండ్రి

ఈనెల 24న మా అబ్బాయికి జ్వరం వచ్చిందని, దాదాపు 11 ఆస్పత్రులు తిరిగినా ఎవరూ పట్టించుకోలేదని చెప్పారు. చివరికి ఎర్రగడ్డ ఆస్పత్రిలో చేర్పిస్తే ఈనెల 26న చనిపోయాడన్నారు. అంతకుముందు ఓ డయాగ్నొస్టిక్ సెంటర్‌లో టెస్ట్ చేయించామని, చనిపోయిన తర్వాత కరోనా అని తెలిసిందని తెలిపారు.

Tags:    

Similar News