ఇంట్లో గొడవ.. పోలీస్ స్టేషన్లో యువకుడు ఆత్మహత్యాయత్నం
దిశ, అదిలాబాద్ : వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన శనివారం ఆదిలాబాద్‌లో చోటు చేసుకుంది. పట్టణంలోని శాంతి నగర్ కాలనీకి చెందిన రాహుల్ గౌడ్ కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. శుక్రవారం రాత్రి రాహుల్ గౌడ్ ఇంట్లో గొడవ పడడంతో అతని భార్య డయల్ 100కు ఫోన్ చేసినట్లు సమాచారం. అయితే వన్‌టౌన్ పోలీసులు రాహుల్ గౌడ్ ను పోలీస్ స్టేషన్‌కు […]
దిశ, అదిలాబాద్ : వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన శనివారం ఆదిలాబాద్‌లో చోటు చేసుకుంది. పట్టణంలోని శాంతి నగర్ కాలనీకి చెందిన రాహుల్ గౌడ్ కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. శుక్రవారం రాత్రి రాహుల్ గౌడ్ ఇంట్లో గొడవ పడడంతో అతని భార్య డయల్ 100కు ఫోన్ చేసినట్లు సమాచారం. అయితే వన్‌టౌన్ పోలీసులు రాహుల్ గౌడ్ ను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు.
మరుసటి రోజు (శనివారం) ఉదయం మళ్లీ స్టేషన్ కు రావాలని పోలీసులు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే మనస్తాపానికి గురైన రాహుల్ గౌడ్ విషం తాగి స్టేషన్ వచ్చాడా..? లేదా స్టేషన్లోనే విషం తాగడా..? అనే విషయంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. స్టేషన్లో స్పృహ కోల్పోయి పడిపోవడంతో పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.