నా చావుకి కారణం వాళ్లిద్దరే..

దిశ, ఏపీ బ్యూరో: ప్రియురాలు మోసం చేసిందని చెబుతూ సెల్ఫీ వీడియో తీసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో చోటు చేసుకుంది. రైలు పట్టాల పక్కన పడి ఉన్న మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని ఘటన వివరాలు చెబుతూ… మృతుడు భీమవరంకి చెందిన జక్కంపూడి కనకారావు అని పోలీసులు చెప్పారు. ప్రేమ పేరిట తనతో ఒక యువతి చనువుగా ఉంటూ చివరకు మోసం చేసిందని సెల్ఫీ వీడియోలో చెబుతూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ […]

Update: 2020-06-27 01:57 GMT

దిశ, ఏపీ బ్యూరో: ప్రియురాలు మోసం చేసిందని చెబుతూ సెల్ఫీ వీడియో తీసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో చోటు చేసుకుంది. రైలు పట్టాల పక్కన పడి ఉన్న మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని ఘటన వివరాలు చెబుతూ… మృతుడు భీమవరంకి చెందిన జక్కంపూడి కనకారావు అని పోలీసులు చెప్పారు. ప్రేమ పేరిట తనతో ఒక యువతి చనువుగా ఉంటూ చివరకు మోసం చేసిందని సెల్ఫీ వీడియోలో చెబుతూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ అమ్మాయితోపాటు ఓ యువకుడు కూడా తన చావుకు కారణమని, వారిని కఠినంగా శిక్షించాలని అతడు సెల్ఫీ వీడియోలో కోరాడు. ఆ సెల్ఫీ వీడియోను రికార్డు చేసిన అనంతరం తమ బంధువులకు పంపాడని చెప్పారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Tags:    

Similar News