ముషీరాబాద్‌లో బీజేపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం..

దిశ, వెబ్‌డెస్క్ : ముషీరాబాద్ నియోజకవర్గంలోని బీజేపీ పార్టీ ఆఫీసు ఎదుట ఆందోళన నెలకొంది. కష్టపడి పనిచేసే వారికి కాకుండా కాంగ్రెస్ నుంచి వచ్చిన అభ్యర్థికి కార్పొరేటర్ టిక్కెట్ కేటాయించడాన్ని నిరసిస్తూ బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. ఇప్పటికైనా పార్టీలో ముందు నుంచి కష్టపడి పనిచేసే వారికి మాత్రమే టిక్కెట్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కేటాయించిన టిక్కెట్లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనియెడల సామూహిక ఆత్మహత్య లకు సిద్ధమవుతామని […]

Update: 2020-11-18 02:24 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ముషీరాబాద్ నియోజకవర్గంలోని బీజేపీ పార్టీ ఆఫీసు ఎదుట ఆందోళన నెలకొంది. కష్టపడి పనిచేసే వారికి కాకుండా కాంగ్రెస్ నుంచి వచ్చిన అభ్యర్థికి కార్పొరేటర్ టిక్కెట్ కేటాయించడాన్ని నిరసిస్తూ బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. ఇప్పటికైనా పార్టీలో ముందు నుంచి కష్టపడి పనిచేసే వారికి మాత్రమే టిక్కెట్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కేటాయించిన టిక్కెట్లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

లేనియెడల సామూహిక ఆత్మహత్య లకు సిద్ధమవుతామని కాషాయ కార్యకర్తలు హెచ్చరించారు. ఈ విషయంపై బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ వచ్చి తమకు సమాధానం చెప్పాలని, అప్పటివరకు కదిలేది లేదని బైఠాయించారు. ఈ నేపథ్యంలోనే ఓ కార్యకర్త తన వెంట తెచ్చుకున్న బాటిల్ మూత తీసి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు. తోటి నాయకులు, పోలీసులు వెంటనే అతన్నిపట్టుకోవడంతో పెనుప్రమాదం తప్పింది.

Tags:    

Similar News