ఆర్థిక వనరులను వృథా చేయొద్దు: రాజ్‌నాథ్ సింగ్

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా దేశంపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందనీ, దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్థిక వనరులను వృథా చేయకుండా, పరిమితంగా వాడుకోవాలని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సాయుధ దళాలను కోరారు. కరోనా వైరస్‌పై పోరాటంలో సాయుధ దళాల కార్యాచరణ, సంసిద్ధతను శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాజ్‌నాథ్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో కోవిడ్ 19పై పోరాడేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్న సాయుధ దళాలను ఆయన అభినందించారు. […]

Update: 2020-04-24 07:41 GMT

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా దేశంపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందనీ, దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్థిక వనరులను వృథా చేయకుండా, పరిమితంగా వాడుకోవాలని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సాయుధ దళాలను కోరారు. కరోనా వైరస్‌పై పోరాటంలో సాయుధ దళాల కార్యాచరణ, సంసిద్ధతను శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాజ్‌నాథ్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో కోవిడ్ 19పై పోరాడేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్న సాయుధ దళాలను ఆయన అభినందించారు. ప్రస్తుత పరిస్థితిని శత్రువులు తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉన్నందున, కరోనాపై పోరాటానికే కాకుండా కర్తవ్య నిర్వహణకూ సిద్ధంగా ఉండాలని సూచించారు. లాక్‌డౌన్ ముగిసిన తర్వాత ఆర్థికంగా నిలదొక్కుకునే అంశాల గురించి ఆలోచించాలని త్రివిధ దళాల అధిపతులను కోరారు. ఈ సమీక్షలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, సైనిక దళాధిపతి ఎంఎం నరవనే, నావికా దళాధిపతి అడ్మిరల్ కరంబీర్ సింగ్, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్‌కేఎస్ భదౌరియాలతో ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags: rajnath sing, defence minister, corona, covid 19, military officials, bipin rawat, cds, mm naravane

Tags:    

Similar News