కరీంనగర్‌లో చాళుక్యుల కాలంనాటి వినాయకుడు

దిశ, కరీంనగర్: అలనాటి వైభవపు ఆనవాళ్లకు సజీవ సాక్ష్యంగా నిలిచే కరీంనగర్ జిల్లాలో చరిత్ర సాక్ష్యం మరోటి వెలుగులోకి వచ్చింది. చాళుక్యుల కాలంనాటి వినాయకుని విగ్రహం ఒకటి బయటపడడంతో ఎటు వైపు చూసినా జిల్లాలో శతాబ్దాల క్రితం నాటి చరిత్ర సాక్ష్యాలు సజీవంగా బయటపడుతున్నాయి. తాజాగా జిల్లాలోని గన్నేరువరం మండలం మైలారంలో చాళుక్యుల కాలం నాటి వినాయకుని విగ్రహం బయటపడింది. పూర్వకాలంలో దేవుని మైలారంగా పిలవబడే ఈ గ్రామంలో నల్లరాతితో తయారు చేసిన వినాయకుని ప్రతిమ బయటపడడం […]

Update: 2020-07-09 10:42 GMT

దిశ, కరీంనగర్: అలనాటి వైభవపు ఆనవాళ్లకు సజీవ సాక్ష్యంగా నిలిచే కరీంనగర్ జిల్లాలో చరిత్ర సాక్ష్యం మరోటి వెలుగులోకి వచ్చింది. చాళుక్యుల కాలంనాటి వినాయకుని విగ్రహం ఒకటి బయటపడడంతో ఎటు వైపు చూసినా జిల్లాలో శతాబ్దాల క్రితం నాటి చరిత్ర సాక్ష్యాలు సజీవంగా బయటపడుతున్నాయి. తాజాగా జిల్లాలోని గన్నేరువరం మండలం మైలారంలో చాళుక్యుల కాలం నాటి వినాయకుని విగ్రహం బయటపడింది. పూర్వకాలంలో దేవుని మైలారంగా పిలవబడే ఈ గ్రామంలో నల్లరాతితో తయారు చేసిన వినాయకుని ప్రతిమ బయటపడడం విశేషం. ఈ విగ్రహం క్రీ.శ 11, 12వ శతాబ్దానికి చెందినదని పురావస్తు శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వేములవాడ కేంద్రంగా చాళుక్యులు పరిపాలన కొనసాగించిన కాలంలో మైలారంలో ఈ విగ్రహాలను ప్రతిష్టించి ఉంటారని భావిస్తున్నారు. గ్రామంలోని భూమిలో లభ్యమైన ఈ శిల్పంతో గతకాలపు చరిత్ర వెలుగులోకి వచ్చినట్టయిందని ప్రజలు సంతోషిస్తున్నారు. చాళుక్యుల కాలంలో గ్రామంలో పెద్ద ఎత్తున వివిధ దేవతల రూపాల్లో ఉన్న విగ్రహాలను ప్రతిష్టించారని తెలుస్తోంది.

Tags:    

Similar News