తెలంగాణ సచివాలయం కూల్చివేత ప్రారంభం

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కొత్త సచివాలయ నిర్మాణానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో… పాత సచివాలయ భవనాల కూల్చివేతను ప్రభుత్వం ప్రారంభించింది. మంగళవారం తెల్లవారుజాము నుంచే భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు మొదలు పెట్టారు. ప్రస్తుతం సీ బ్లాక్‌ను భారీ యంత్రాలతో కూల్చివేస్తున్నారు. ఉదయం పూట సచివాలయం వెళ్లే అన్ని మార్గాలను పోలీసులు మూసివేయడంతో దాదాపు రెండు గంటల పాటు ట్రాఫిక్ జామ్ అయ్యి వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఖైరతాబాద్, రవీంద్ర భారతి, హిమాయత్‌నగర్ కూడళ్ల వద్ద […]

Update: 2020-07-07 05:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కొత్త సచివాలయ నిర్మాణానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో… పాత సచివాలయ భవనాల కూల్చివేతను ప్రభుత్వం ప్రారంభించింది. మంగళవారం తెల్లవారుజాము నుంచే భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు మొదలు పెట్టారు. ప్రస్తుతం సీ బ్లాక్‌ను భారీ యంత్రాలతో కూల్చివేస్తున్నారు. ఉదయం పూట సచివాలయం వెళ్లే అన్ని మార్గాలను పోలీసులు మూసివేయడంతో దాదాపు రెండు గంటల పాటు ట్రాఫిక్ జామ్ అయ్యి వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఖైరతాబాద్, రవీంద్ర భారతి, హిమాయత్‌నగర్ కూడళ్ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News