చోరకళలో ఆరితేరిన శ్రీవిష్ణు

దిశ, సినిమా : కథల ఎంపిక, క్యారెక్టర్ సెలక్షన్‌లో వైవిధ్యాన్ని చూపే నటుడు శ్రీవిష్ణు. హీరోగా క్రియేటివిటీ ఉన్న కథాంశాలను ఎంచుకోవడమే కాకుండా ‘టైటిల్స్’ విషయంలోనూ అందరికంటే విభిన్న పంథాను అవలంభిస్తున్నాడు. ‘అర్జున ఫాల్గుణ’, ‘భళా తందనాన’ ‘గాలి సంపత్’ ఇలా వరుస సినిమాలతో దూసుకుపోతున్న శ్రీవిష్ణు పుట్టిన రోజు సందర్భంగా ఆయా చిత్ర బృందాలు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశాయి. ఈ సందర్భంగా శ్రీవిష్ణు హీరోగా, హసిత్ గోలి దర్శకత్వంలో వస్తున్న కొత్త సినిమా ఫస్ట్ లుక్ […]

Update: 2021-02-28 08:05 GMT

దిశ, సినిమా : కథల ఎంపిక, క్యారెక్టర్ సెలక్షన్‌లో వైవిధ్యాన్ని చూపే నటుడు శ్రీవిష్ణు. హీరోగా క్రియేటివిటీ ఉన్న కథాంశాలను ఎంచుకోవడమే కాకుండా ‘టైటిల్స్’ విషయంలోనూ అందరికంటే విభిన్న పంథాను అవలంభిస్తున్నాడు. ‘అర్జున ఫాల్గుణ’, ‘భళా తందనాన’ ‘గాలి సంపత్’ ఇలా వరుస సినిమాలతో దూసుకుపోతున్న శ్రీవిష్ణు పుట్టిన రోజు సందర్భంగా ఆయా చిత్ర బృందాలు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశాయి. ఈ సందర్భంగా శ్రీవిష్ణు హీరోగా, హసిత్ గోలి దర్శకత్వంలో వస్తున్న కొత్త సినిమా ఫస్ట్ లుక్ టైటిల్ రివీల్ చేసింది చిత్ర బృందం.

https://twitter.com/indian_bo/status/1365960279394197505

64 కళల్లో ఆరితేరి పేరు తెచ్చుకుంటే, శ్రీవిష్ణు మాత్రం తన చోర కళను చూపించడానికి ‘రాజరాజ చోర’గా వస్తున్నాడు. పౌరాణిక గెటప్‌లో శ్రీవిష్ణు ఆకట్టుకుంటుండగా, టైటిల్ కూడా ఆసక్తి రేపుతోంది. ఫస్ట్ లుక్ చూస్తుంటే, అతడి నుంచి మరో కామెడీ ఎంటర్‌టైనర్ ఖాయమని అర్థమవుతోంది. రిలీజ్ డేట్ కూడా త్వరగా దొంగిలిస్తారని ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ హ్యాపీ కన్ఫ్యూజింగ్ బర్త్ డే అంటూ శ్రీవిష్ణుకు రాజ్య ప్రజల తరపున మేకర్స్ విషెస్ తెలిపారు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా ఇందులో సునయన శ్రీవిష్ణుకు జోడీగా నటిస్తోంది.

Tags:    

Similar News