బంగ్లాకు అమెరికా షాక్.. టీ20 సిరీస్ కైవసం

టీ20 సిరీస్‌లో బంగ్లాదేశ్‌‌కు ఆతిథ్య అమెరికా మళ్లీ షాకిచ్చింది.

Update: 2024-05-23 19:39 GMT

దిశ, స్పోర్ట్స్ : టీ20 సిరీస్‌లో బంగ్లాదేశ్‌‌కు ఆతిథ్య అమెరికా మళ్లీ షాకిచ్చింది. తొలి టీ20లో బంగ్లాను ఓడించిన యునైటెడ్ స్టేట్స్ రెండో మ్యాచ్‌లోనూ అదరగొట్టింది. గురువారం జరిగిన రెండో టీ20లో 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌ చేసిన యునైటెడ్ స్టేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. కెప్టెన్ మోనాంక్ పటేల్(42), ఆరోన్ జోన్స్(35), స్టీవెన్ టేలర్(31) రాణించడంతో ఆ జట్టు పోరాడే స్కోరు సాధించింది. అనంతరం మోస్తరు లక్ష్యాన్ని అమెరికా జట్టు కాపాడుకుంది. బంగ్లాదేశ్‌ను కట్టడి చేసింది. ఛేదనలో తేలిపోయిన బంగ్లా జట్టు 19.3 ఓవర్లలో 138 పరుగులకే ఆలౌటై ఓటమిపాలైంది. కెప్టెన్ శాంటో(36) టాప్ స్కోరర్. అమెరికా బౌలర్లు అలీ ఖాన్(3/25), సౌరభ్ నేత్రవాల్కర్(2/15), షాడ్లీ వాన్ షాల్క్‌విక్ బంగ్లా పతనాన్ని శాసించారు. ఈ విజయంతో అమెరికా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే మూడు టీ20ల సిరీస్‌ను 2-0తో దక్కించుకుంది. శనివారం ఆఖరి టీ20 జరగనుంది.  

Tags:    

Similar News