మ్యాచ్‌కు డుమ్మా కొట్టిన ఇద్దరు బంగ్లాదేశ్‌ ప్లేయర్స్‌కు షాక్

దిశ, వెబ్‌డెస్క్ : కామన్‌వెల్త్‌ గేమ్స్‌ ఈవెంట్‌లో మ్యాచ్‌కు - Two table tennis players to be slapped with a ban for skipping Commonwealth Games matches

Update: 2022-09-01 11:51 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కామన్‌వెల్త్‌ గేమ్స్‌ ఈవెంట్‌లో మ్యాచ్‌కు రాకుండా డుమ్మా కొట్టిన ఇద్దరు బంగ్లాదేశ్‌ ప్లేయర్స్‌కు షాక్ తగిలింది. సోనమ్‌ సుల్తానా సోమా, సాదియా అక్తర్‌ మౌ అనే ఇద్దరు బంగ్లాదేశ్‌ టీటీ ప్లేయర్లు.. మహిళల మ్యాచ్‌ల్లో (సింగిల్స్‌, డబుల్స్‌, మిక్సడ్‌ డబుల్స్‌) పాల్గొనాల్సి ఉండింది. కానీ అధికారులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, మ్యాచ్‌ సమయానికి కనిపించకుండా పోయారు. అయితే విచారణలో బంధువుల ఇళ్లకు వెళ్లినట్లు తెలిసింది. దీంతో ఇద్దరిపై రెండేళ్ల నిషేధం విధిస్తూ బంగ్లాదేశ్‌ టేబుల్‌ టెన్నిస్‌ ఫెడరేషన్‌ ప్రకటించింది.

Tags:    

Similar News