కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా స్టార్ ప్లేయర్
టీమిండియా యువ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ అరుదైన రికార్డు సృష్టించాడు.
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా యువ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ అరుదైన రికార్డు సృష్టించాడు. నిన్న టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. సొంత గడ్డపై 2-0 తేడాతో భారత్ టీ20 సిరీస్‌ను దక్కించుకుంది. ఇక, ఈ మ్యాచ్‌లో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ న్యూజిలాండ్‌పై 63 బంతుల్లో 126 (నాటౌట్) పరుగులు చేశాడు. దాంతో టీ20 అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక స్కోర్‌ను నమోదు చేశాడు. ఇది వరకు ఆఫ్ఘనిస్తాన్పై 61 బంతుల్లో 122 (నాటౌట్) పరుగులతో విరాట్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు.