IPL: తెలుగులో మాట్లాడిన రోహిత్ శర్మ (వీడియో)

హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానం వేదికగా రేపు(ఏప్రిల్ 8) కీలక ఐపీఎల్‌ మ్యాచ్ జరుగనుంది. ముంబై ఇండియన్స్ జట్టుతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడనుంది.

Update: 2023-04-17 17:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానం వేదికగా రేపు(ఏప్రిల్ 8) కీలక ఐపీఎల్‌ మ్యాచ్ జరుగనుంది. ముంబై ఇండియన్స్ జట్టుతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడనుంది. దీంతో ఇప్పటికే ఇరు జట్లు నగరానికి చేరుకొని మైదానంలో ప్రాక్టీస్ ప్రారంభించేశాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ తెలుగులో మాట్లాడారు. ‘మేము వచ్చేశాము.. MI ఫ్యాన్స్‌ మైదానానికి పదండి’ అని మాట్లాడారు. ప్రస్తుతం ఈ వీడియోను క్రికెట్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా పోస్టు చేసి షేర్ చేస్తున్నారు.

Tags:    

Similar News