RCB లవర్.. ఉల్లి, వెల్లుల్లితో విరాట్ కోహ్లీ ఆర్ట్ (వీడియో)

విరాట్ కోహ్లీ.. ఈ పేరు వింటే చాలు క్రికెట్ అభిమానులకు పూనకాలే.

Update: 2024-05-18 15:21 GMT

దిశ, ఫీచర్స్: విరాట్ కోహ్లీ.. ఈ పేరు వింటే చాలు క్రికెట్ అభిమానులకు పూనకాలే. కోహ్లీ టీమిండియాకు ఆడినా.. ఐపీఎల్‌లో ఆడినా ఫ్యాన్స్ అతడి ఆటను తెగ ఎంజాయ్ చేస్తుంటారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐపీఎల్ ఫీవర్ కొనసాగుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్న కోహ్లీ.. ఈ ఏడాది కూడా తన అద్భుతమైన ఫాంను కొనసాగిస్తూ ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా కొనసాగుతున్నాడు. అయితే, కోహ్లీకి ఉన్న ఫ్యాన్ క్రేజ్ అంతాఇంతా కాదు. ఇటీవలి కాలంలో తమ అభిమాన క్రికెటర్ల కోసం ఫ్యాన్స్ తమ క్రియేటివిటీకి పని చెబుతున్నారు.

తాజాగా విరాట్ ఫ్యాన్ ఒకరు ఉల్లి, వెల్లుల్లి కాంబినేషన్‌తో అతని చిత్రాన్ని రూపొందించగా.. డ్రోన్ కెమెరాతో ఆ అద్భుత దృష్యాన్ని బంధించారు. ప్రస్తుతం దీనికి సంబంధించి వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే.. సీఎస్కేతో నేడు జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ భారీ తేడాతో గెలిస్తే.. ఆ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరుతుంది. దీంతో ఆర్సీబీ గెలవాలని బెంగళూరు టీం, విరాట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కాగా.. IPL లో ఒకే వేదికలో 3000+ రన్స్ చేసిన తొలి ప్లేయర్‌గా RCB స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఇవాళ్టి మ్యాచ్‌లో విరాట్ ఈ ఘనత అందుకున్నాడు. 3005 రన్స్‌తో కోహ్లీ టాప్‌లో ఉండగా.. ఆ తర్వాత స్థానాల్లో రోహిత్ శర్మ (వాంఖడే-2295), డివిలియర్స్ (1960-చినస్వామి) ఉన్నారు.

Similar News