మలేషియా మాస్టర్స్ 2024 లో రన్నరప్ గా పీవీ సింధు

సుదీర్ఘ విరామం తర్వాత తొలి సూపర్ సిరీస్ టైటిల్ దిశగా కీలక అడుగు వేసిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు మరోసారి నిరాశే ఎదురైంది.

Update: 2024-05-26 12:59 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: సుదీర్ఘ విరామం తర్వాత తొలి సూపర్ సిరీస్ టైటిల్ దిశగా కీలక అడుగు వేసిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు మరోసారి నిరాశే ఎదురైంది. మలేషియా మాస్టర్ సూపర్ టైటిల్ పోరులో పరాజయం పాలైంది. రెండు సార్లు ఒలంపిక్స్ పథకాలు నెగ్గి స్టార్ షట్లర్ గా పేరు తెచ్చుకున్న పీవీ సింధు టైటిల్ పోరులో వరుస అపజయాలు మూటగట్టుకుంటుంది. మలేషియా మాష్టర్ సూపర్ 500 లో పాల్గొన్న సింధు వరుస విజయాలతో ఫైనల్ కు దూసుకెళ్లింది. ఇవ్వాళ జరిగిన ఫైనల్ మ్యాచ్ లో చైనా షట్లర్ వాంగ్ జీయీ చేతిలో 21-16, 5-21, 16-21 తేడాతో ఓటమి చవిచూసింది.

తొలి సెట్ లో వాంగ్ జూయీ పై ఆధిపత్యం కనబర్చిన సింధు రెండు, మూడు సెట్లలో చతికిలపడింది. రెండో సెట్లో కేవలం ఐదు పాయింట్లు మాత్రమే సాధించిన సింధు మూడో సెట్ లో కాస్త పుంజుకొని దూకుడుగా ఆరంభించింది. కానీ మ్యాచ్ చివరికి వచ్చే సరికి 21 పాయింట్లతో వాంగ్ జూయీదే పై చేయిగా నిలిచింది. దీంతో సింధు మలేషియా మాస్టర్స్ 2024 లో రన్నరప్ గా నిలిచింది. ఈ టైటిల్ పోరులో సింధు నెగ్గి ఉంటే మరో రెండు నెలల్లో ప్రారంభం కానున్న పారిస్ ఒలంపిక్స్‌ లో నెగ్గేందుకు తన ఆత్మవిశ్వాసానికి తొలి అడుగు పడినట్టు అయ్యేది.  

Similar News