పాకిస్తాన్ జట్టుతో ఆడటం కంటే.. ఐపీఎల్ ఆడటం బెటర్: మాజీ క్రికెటర్

ఇంగ్లాండ్ జట్టు మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ పాకిస్తాన్ జట్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ జట్టుతో ఆడటం కంటే.. ఐపీఎల్ ఆడటం బెటర్ ఆయన తన అభిప్రాయాన్ని తెలిపారు.

Update: 2024-05-26 09:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లాండ్ జట్టు మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ పాకిస్తాన్ జట్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ జట్టుతో ఆడటం కంటే.. ఐపీఎల్ ఆడటం బెటర్ ఆయన తన అభిప్రాయాన్ని తెలిపారు. ఎందుకంటే అన్ని దేశాల ప్లేయర్లతో జరిగే ఐపీఎల్ ఆడటం వల్ల ప్లేయర్లకు టీ20 వరల్డ్ కప్ లో రాణించడానికి ఉపయోగపడుతుందన్నారు. అలాగే తాను పాకిస్థాన్ జట్టును తక్కువ అంచనా వేయడం లేదని.. ఐపీఎల్ వల్ల కలిగే లాభాలను ఎత్తి చూపుతున్నానని అన్నారు. ఇటీవల ఐపీఎల్ లో ఆడిన ఇంగ్లాండ్ ప్లేయర్లు విల్ జాక్స్, ఫిల్ సాల్ట్ వంటి యువ ప్లేయర్లు..పదునెక్కుతారని.. ఐపీఎల్ నుంచి వారు చాలా నేర్చుకోవచ్చని అన్నారు. ఐపీఎల్ లో ఉండే ఒత్తిడి, ఫ్యాన్స్, ఫ్రాంచైజీ యజమానుల, సోషల్ మీడియా, భారీ టోర్నమెంట్, ఇలా అన్నింటి నుంచి యువ ప్లేయర్లు నేర్చుకోవడానికి ఎంతో దొరుకుతుందని.. వారి ఆట తీరును మెరుగు పరుచుకోవడానికి తగినంత సమయం ఉంటుందని.. ప్లేయర్లు ఎంతో కొంత నేర్చుకోవచ్చని మైకేల్ వాన్ అభిప్రాయపడ్డారు. కాగా పాకిస్తాన్ తో జరిగిన టీ20 సిరీస్ లో ఇంగ్లాండ్ జట్టు భారీ విజయం సాధించింది. ఆ మ్యాచులో విల్ జాక్స్ ఫోర్లు సిక్సర్లతో పాకిస్తాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

Similar News