ఫిట్నెస్ మెయిన్‌టెన్ చేయండి.. పాక్ కెప్టెన్‌పై ట్రోలింగ్స్..
ఇస్లామాబాద్: పాకిస్తాన్ క్రికెట్ కెప్టెన్ బాబర్ ఆజామ్ ట్రోలింగ్‌కు గురయ్యాడు. Latest Telugu News
ఇస్లామాబాద్: పాకిస్తాన్ క్రికెట్ కెప్టెన్ బాబర్ ఆజామ్ ట్రోలింగ్‌కు గురయ్యాడు. ప్రస్తుతం నెదర్లాండ్ పర్యటనలో ఉన్న బాబర్.. ట్విట్టర్లో కొన్ని ఫోటోలు షేర్ చేశాడు. దీంతో నెటిజన్లు భారీగా ట్రోలింగ్ చేస్తున్నారు. 'భాయ్.. కడుపు బయటకు వస్తోంది.. దాన్ని ఏమైనా చేయండి.. రోహిత్ శర్మలా అవ్వకండి.' అని అమరుల్లా అనే వ్యక్తి కామెంట్ చేశాడు. 'ఫిట్నెస్ మెయిన్‌టెన్ చేయండి. ఇది మీకు చాలా అవసరమనిపిస్తోంది. మీరే పాకిస్తాన్‌కు ఉన్న ఆస్తి.' అని కామెంట్ చేస్తున్నారు. కాగా, బాబర్ ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్మెన్లలో బాబర్ కూడా ఒకడు. ఆసియాకప్‌లో భాగంగా ఈ నెల 28న భారత్-పాకిస్తాన్లో మ్యాచ్ ఉండనుంది.