KANE WILLIAMSON: ముచ్చటగా మూడోసారి తండ్రైన కేన్ విలియన్‌సన్.. సంబురాల్లో కివీస్ ఫ్యాన్స్

న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ కేన్ విలియమ్సన్ ముచ్చటగా మూడోసారి తండ్రయ్యాడు.

Update: 2024-02-28 08:48 GMT

దిశ, వెబ్‌డెస్క్: న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ కేన్ విలియమ్సన్ ముచ్చటగా మూడోసారి తండ్రయ్యాడు. ఈ మేరకు కేన్ భార్య సారా రహీమ్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని విలియమ్సన్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో షేర్ చేసుకున్నాడు. తన భార్య, కుమార్తెతో ఉన్న ఫొటోకు మెసేజ్‌ను ట్యాగ్ చేస్తూ.. పోస్ట్ చేశాడు. కేన్ దంపతులకు ఇంతకు ముందు మూడేళ్ల కుమార్తె, కుమారుడు ఉన్నారు. ‘అందమైన ప్రపంచంలోకి అమ్మాయికి స్వాగతం. నీ రాక, ముందుకు సాగిన ఉత్తేజకరమైన ప్రయాణానికి కృతజ్ఞతలు’ అంటూ కేన్ విలియమ్సన్ ఇన్‌స్టాగ్రామ్‌లో వేదికగా తన సంతోషాన్ని ఫ్యా్న్స్‌తో పంచుకున్నాడు. పోస్టు చూసిన నెటిజన్లు, కవీస్ ఫాన్స్ విలియమ్సన్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News