0.01 సెకన్లలో ఒలింపిక్స్ బెర్త్‌ను దూరం చేసుకున్న తెలుగమ్మాయి జ్యోతి

ఫిన్లాండ్‌లో జరిగిన మోటోనెట్ జీపీ జివాస్కీలా అథ్లెటిక్స్ మీట్‌లో తెలుగమ్మాయి జ్యోతి యర్రాజి స్వర్ణ పతకం సాధించింది.

Update: 2024-05-23 15:59 GMT

దిశ, స్పోర్ట్స్ : ఫిన్లాండ్‌లో జరిగిన మోటోనెట్ జీపీ జివాస్కీలా అథ్లెటిక్స్ మీట్‌లో తెలుగమ్మాయి జ్యోతి యర్రాజి స్వర్ణ పతకం సాధించింది. మహిళల 100 మీటర్ల హార్డిల్స్ ఈవెంట్‌లో ఆమె 12.78 సెకన్లలో రేసును ముగించి విజేతగా నిలిచింది. అయితే, జ్యోతి తృటిలో పారిస్ ఒలింపిక్స్‌ కోటాను కోల్పోయింది. ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలంటే 12.77 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉండగా.. జ్యోతి 0.01 సెకన్లతో బెర్త్‌కు దూరమైంది. జూన్ 30తో ఒలింపిక్ క్వాలిఫికేషన్ ముగియనుంది. అప్పటిలోగా జ్యోతి రోడ్ టూ పారిస్ ర్యాంకింగ్స్‌ను మెరుగుపర్చుకుంటే ఒలింపిక్ కోటా సాధించే అవకాశం ఉంది. పురుషుల 110 మీటర్ల తేజాస్ షిర్సే 13.41 సెకన్లలో రేసును ముగించి గోల్డ్ మెడల్ సాధించాడు. అలాగే, పురుషుల 800 మీటర్ల రేసులో మహ్మద్ అఫ్సల్ విజేతగా నిలిచాడు. 1:48.91 సెకన్లలో అతను లక్ష్యాన్ని చేరుకున్నాడు. పురుషుల 100 మీటర్ల ఈవెంట్‌లో అనిమేష్ కుజుర్ 10.39 సెకన్ల ప్రదర్శనతో రెండో స్థానంలో నిలిచి రజతం దక్కించుకున్నాడు. 

Tags:    

Similar News