చక్రం తిప్పిన జడేజా.. 5 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా..

Update: 2023-02-09 07:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: నాగపూర్ వేదికగా జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ 2023 ట్రోఫి టెస్ట్ సిరీస్ మొదటి మ్యాచ్‌లో ఆదిలోనే ఓపెనర్స్ వికెట్లు కోల్పోయి పికల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో  ఆస్ట్రేలియాకు మార్నస్ లాబుస్చాగ్నే, స్టీవెన్ స్మిత్ ఇద్దరూ కలసి మంచి పాట్నర్ షిప్‌ను అందించి మ్యాచ్‌ను చక్కబెట్టారు. వీరిద్దరూ. మూడో వికెట్ కు 82 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు.

కాగా 35 ఓవర్లో జడేజా.. మార్నస్ లాబుస్చాగ్నే, మాట్ రెన్షా అవుట్ చేశాడు. అలాగే 42 వ ఓవర్లో మంచి ఫామ్ లో ఉన్న స్టీవ్ స్మిత్ ను కూడా అవుట్ చేసి ఆస్ట్రేలియా బ్యాటింగ్ పై పెద్ద దెబ్బ కొట్టాడు. దీంతో ప్రస్తుతం ఆస్ట్రేలియా.. 46 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి.. 129 పరుగులు చేసింది.

ఇవి కూడా చదవండి : IND vs AUS Live Score Updates :టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. ప్లేయింగ్ 11 ఇదే

Tags:    

Similar News