నా దేశం కోసం ఆడినందుకు గర్వపడుతున్నానంటూ.. సునీల్ ఛెత్రి రిటైర్మెంట్
భారత ఫుట్ బాల్ జట్టు కెప్టెన్ సునీల్ చేత్రి అంతర్జాతీయ ఫుట్ బాల్ మ్యాచులకు రిటైర్మెంట్ ప్రకటించారు.
దిశ, వెబ్‌డెస్క్: భారత ఫుట్ బాల్ జట్టు కెప్టెన్ సునీల్ చేత్రి అంతర్జాతీయ మ్యాచులకు రిటైర్మెంట్ ప్రకటించారు. జూన్ 6న కోల్‌కతాలో కువైట్‌తో ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ ఆడనుంది. కాగా అదే తన చివరి మ్యాచ్ అని ఛెత్రి ప్రకటించారు. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటిస్తూ ట్విట్టర్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో సునీల్ ఛెత్రీ ‘నా దేశం కోసం ఆడినందుకు గర్వపడుతున్నానంటూ.. ఉద్వేగానికి లోనయ్యారు. ఆటగాడిగా తన రోజులను గుర్తు చేసుకుంటూ, ఛెత్రీ ఇలా అన్నాడు, "నేను ఎప్పటికీ మరచిపోలేని ఒక రోజు ఉంది. నేను నా దేశం కోసం మొదటి సారి ఆడిన మొదటి మ్యాచ్ నాకు ఎప్పుడు గుర్తుండిపోద్ది. ఆ మ్యాచుకు ముందు రోజు ఉదయం సుఖీ సార్ నా దగ్గరకు వచ్చాడు. ఈ రోజు మీరు ప్రారంభించబోతున్నారని చెప్పారు. ఆ సమయంలో ఎంత ఆనందించానో నేను మీకు చెప్పలేను. ఆ రోజు నేను ఎప్పటికీ మరచిపోలేనని చెప్పుకొచ్చారు. కాగా ఛెత్రి మార్చిలో భారతదేశం తరపున 150వ గేమ్ ఆడాడు. గౌహతిలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఈ మ్యాచ్ లో అతను సందర్భంగా గోల్ చేశాడు. అయితే ఆ గేమ్‌ను భారత్ 1-2తో కోల్పోయింది. 2005లో ఫుట్ బాల్ జట్టులోకి అరంగేట్రం చేసిన ఛెత్రీ దేశం తరఫున 94 గోల్స్ చేశాడు. అతను భారతదేశం యొక్క ఆల్-టైమ్ టాప్ స్కోరర్, అత్యధిక క్యాప్డ్ ప్లేయర్‌గా నిలిచారు.. అతను క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్ మెస్సీ తర్వాత చురుకైన ఆటగాళ్లలో గోల్ స్కోరర్‌ల జాబితాలో మూడవ స్థానంలో ఉన్నాడు.