BREAKING: 153 పరుగులకే భారత్ ఆలౌట్.. ఆరుగురు బ్యాటర్లు డకౌట్

కేప్‌టౌన్ వేదికగా అతిథ్య సౌతాఫ్రికాతో జరుగుతోన్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ తడబడింది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 153 పరుగులకే ఆలౌట్ అయ్యింది. నాలుగు

Update: 2024-01-03 14:31 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేప్‌టౌన్ వేదికగా అతిథ్య సౌతాఫ్రికాతో జరుగుతోన్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ తడబడింది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 153 పరుగులకే ఆలౌట్ అయ్యింది. నాలుగు వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసిన భారత్.. తర్వాత 11 బంతుల్లోనే ఒక్క పరుగు కూడా చేయకుండా మిగిలిన ఆరు వికెట్లను అదే స్కోర్ వద్ద కోల్పోయింది. 34, 35 ఓవర్లలో మూడు మూడు వికెట్ల చొప్పున రెండు ఓవర్లలోనే ఆరుగురు ఔట్ అయ్యారు. టీమిండియాలో 6 గురు బ్యాటర్లు డకౌట్ కావడం గమనార్హం. ఓపెనర్ రోహిత్ శర్మ 39, శుభమన్ గిల్ 36, విరాట్ కోహ్లీ 46, రాహుల్ 8 పరుగులు చేశారు. మిగిలిన ఆరుగురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. 34.5 ఓవర్లలో ఆలౌట్ అయిన టీమిండియా 153 పరుగులు చేసింది. రబాడ, ఎంగిడి, బర్గర్ తలా మూడు వికెట్లు తీశారు. అధిక్యం దిశగా దూసుకుపోతున్న భారత్‌ను రబాడ, ఎంగిడి విభృంభించి దెబ్బకొట్టారు. ఇక, అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా కేవలం 55 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో తొలి ఇన్సింగ్‌లో భారత్ 98 పరుగుల ఆధిక్యం సాధించింది. 

Read More..

ఐసీసీ అవార్డుల రేసులో యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్

Tags:    

Similar News