ICC Under 19 Women's T20 World Cup 2023: భారత్ బోణీ.. సౌతాఫ్రికాపై ఘన విజయం

సౌతాఫ్రికా వేదికగా జరుగుతోన్న ఉమెన్స్ అండర్ - 19 వరల్డ్ కప్‌లో భారత్ బోణీ కొట్టింది.

Update: 2023-01-14 14:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: సౌతాఫ్రికా వేదికగా జరుగుతోన్న ఉమెన్స్ అండర్ - 19 వరల్డ్ కప్‌లో భారత్ బోణీ కొట్టింది. ప్రపంచకప్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో అతిథ్య సౌతాఫ్రికాను టీమిండియా మహిళలు చిత్తు చేశారు. ఈ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన భారత్.. వరల్డ్ కప్ ప్రారంభాన్ని ఘనంగా ఆరంభించింది. సౌతాఫ్రికా విధించిన 167 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన టీమిండియా.. 16.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి టార్గెట్ చేజ్ చేసింది. భారత బ్యాటర్లు ఛేజింగ్‌లో మొదటి నుండే రెచ్చిపోయారు. కెప్టెన్ షఫాలి వర్మ కేవలం 16 బంతుల్లోనే 45 పరుగులు చేసి భారత్‌కు మెరుపు ఆరంభానిచ్చింది. షఫాలి ఔట్ అయిన తర్వాత మరో ఓపెనర్ శ్వేతా తివారి 92 పరుగులతో నాటౌట్‌గా నిలిచి భారత్‌కు ఘన విజయాన్ని అందించింది. తెలుగు అమ్మాయి త్రిష 15 పరుగులు చేసి ఔట్ కాగా.. సౌమ్య తివారి 10 రన్స్ చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో మాడిసన్ ల్యాండ్స్మాన్, మియాన్ స్మిత్, శేష్నీ నాయుడు తలో వికెట్ తీశారు.

Tags:    

Similar News