'అలా చేస్తే తప్ప టీమిండియా ప్రపంచకప్ గెలవదు'

దిశ, వెబ్‌డెస్క్: టీ20 వరల్డ్ కప్ 2022కు అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి.

Update: 2022-09-25 12:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీ20 వరల్డ్ కప్ 2022కు అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ 16 నుంచి ప్రారంభం కానుండగా.. ఈ క్రమంలోనే టీమిండియాపై మాజీ క్రికెటర్ అజయ్ జడేజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాకు రాబోయే ప్రపంచకప్‌ చాలా కీలకమని భారత మాజీ క్రికెటర్ జోస్యం చెప్పాడు. ఆస్ట్రేలియాతో జరిగే మూడో టీ20 మ్యచ్‌ ప్రపంచకప్‌‌కు భారత్ పరుగు ప్రారంభమవుతుందని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా దక్షిణాఫ్రికాతో సిరీస్ ముగిసే వరకు ప్రతి మ్యాచ్‌లో టీమిండియా గెలవాలని, అలా చేస్తే తప్ప మనం ప్రపంచ కప్ గెలవలేమని వ్యాఖ్యానించాడు. ఇప్పటి నుంచి టీమిండియా అన్ని మ్యాచ్‌లు గెలవాలని, ఆ ఊపు ప్రపంచకప్‌లో‌ కొనసాగాలని అభిప్రాయసడ్డాడు.

Similar News