కువైట్‌తో పోరుకు భారత జట్టు ఎంపిక

ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌ క్వాలిఫయర్స్‌లో భాగంగా జూన్ 6న కువైట్‌తో భారత్ తలపడనుంది.

Update: 2024-05-23 19:42 GMT

దిశ, స్పోర్ట్స్ : ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌ క్వాలిఫయర్స్‌లో భాగంగా జూన్ 6న కువైట్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో కువైట్‌తో తలపడే భారత ఫుట్‌బాల్ జట్టు ఖరారైంది. హెడ్ కోచ్ ఇగోర్ స్టిమాక్ గురువారం 27 మందితో జట్టును వెల్లడించాడు. పార్ధివ్ గొగోయ్, మహమ్మద్ హమ్మద్ గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరంగా ఉండనున్నారు. వారితోపాటు ఫుర్బా లాచెన్పా, ఇమ్రాన్ ఖాన్, జితిన్‌లకు చోటు దక్కలేదు. క్వాలిఫయర్స్‌లో తర్వాతి రౌండ్‌కు చేరుకోవాలంటే కువైట్‌పై గెలవడం భారత్‌కు కీలకం. అలాగే, ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలకనున్నట్టు భారత కెప్టెన్ సునీల్ ఛెత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. 

Tags:    

Similar News