వరల్డ్‌కప్‌లో టీమిండియాకు అతడు కీలకం: ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్

మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ప్రపంచకప్‌ 2022 కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.Latest Telugu News

Update: 2022-10-03 10:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ప్రపంచకప్‌ 2022 కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టీ20 వరల్డ్‌కప్ కోసం అన్ని జట్లు సన్నద్ధం అవుతుండగా.. యువ ఆటగాళ్ల ఫామ్‌పై మాజీ, సీనియర్ క్రికెటర్లు స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా స్థానంలో పేసర్ మహ్మద్ సిరాజ్‌కు అవకాశం ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు. ' సిరాజ్ కొత్త బంతితో అద్భుతంగా ఆడగలడు. అతడు బంతిని దూరంగా స్వింగ్ చేస్తాడు. బౌలింగ్ నైపుణ్యాలు కూడా చాలా బాగున్నాయి. ఐపీఎల్‌లో గత రెండు సంవత్సరాలుగా మంచి ప్రదర్శనతో రాణిస్తున్నాడు. కాబట్టి, బహుశా అతడు టీమిండియా బౌలర్లలో చాలా ప్రభావం చూపే వ్యక్తి అవుతాడు' అని వాట్సన్ అన్నాడు.

Similar News