వరల్డ్ కప్ తర్వాత టీమ్ ఇండియా కెప్టెన్ అతడే : సునీల్ గవాస్కర్

Update: 2023-03-14 15:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీమ్ ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాపై టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ తర్వాత టీమ్ ఇండియా కు పరిమిత ఓవర్ల క్రికెట్లో హార్దిక్ పాండ్యానే కెప్టెన్ అవుతాడని అభిప్రాయపడ్డాడు. టీ20లో హార్దిక్ కెప్టెన్సీ నన్ను ఎంతో ఆకట్టుకుంది.. ఐపీఎల్‌లో కెప్టెన్సీ చేపట్టిన తొలిసారే గుజరాత్ టైటాన్స్‌ను చాంపియన్‌గా నిలిపాడు. పరిమిత ఓవర్ల జట్టుకు సారథ్యం వహిస్తూ.. తనను తాను నిరూపించుకుంటున్నాడు.

ఇప్పుడు ఆస్ట్రేలియా తో తొలి వన్డేలో భారత్ గెలిస్తే.. 2023 వరల్డ్ కప్ తర్వాత భారత్ కెప్టెన్ రేసులో హార్దిక్ పాండ్యానే ముందు నిలుస్తాడని గవాస్కర్ పేర్కొన్నారు. భారత జట్టు మిడిలార్డర్‌లో హార్దిక్ పాండ్యా వంటి ఆటగాడి అవసరం ఎంతో ఉంటుందని గవాస్కర్ అభిప్రాయపడ్డారు. ఆట స్వరూపాన్ని మార్చగల సత్తా ఉన్న ప్లేయర్ హార్దిక్ పాండ్యా.. జట్టుకు అవసరమైనప్పుడు బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకెళ్లి ఆడగల సత్తా ఉన్న ఆటగాడు అని కొనియాడారు.

Tags:    

Similar News