హైదరాబాద్‌కు చేరిన ఫార్ములా-ఈ కారు

దేశంలో మొట్టమొదటి సారిగా ఫార్ములా-ఈ కార్ రేసింగ్ చాంపియన్‌షిప్ పోటీలకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనున్న విషయం తెలిసిందే.

Update: 2022-09-25 16:36 GMT

హైదరాబాద్: దేశంలో మొట్టమొదటి సారిగా ఫార్ములా-ఈ కార్ రేసింగ్ చాంపియన్‌షిప్ పోటీలకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆదివారం దుర్గం చెరువుపై ఉన్న కేబుల్ బ్రిడ్జిపై ఫార్ములా-ఈ కారును మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఆవిష్కరించారు. హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ చుట్టూ ఈ రేస్ జరగనుంది.

హుస్సేన్ సాగర్, లుంబిని పార్క్, ఎన్టీఆర్ పార్క్, సంజీవయ్య పార్క్ మీదుగా 2.3 కిలో మీటర్ల మేరా ట్రాక్ ఉండనుంది. దీని కోసం ప్రత్యేకంగా ట్రాక్ ఏర్పాటు చేయనున్నారు. కాగా, న్యూయార్క్, లండన్, బెర్లిన్, రోమ్, సియోల్‌లలో మాత్రమే ఫార్ములా-ఈ రేసింగ్ నిర్వహిస్తుంటారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా హైదరాబాద్‌లో ఫార్ములా-ఈ రేసింగ్ జరగనుంది. ప్రపంచంలోని 12 నగరాల్లో హైదరాబాద్ ఎంపిక కావడం జరిగింది. 2023 ఫిబ్రవరి 11వ తేదీన ఫార్ములా-ఈ రేసింగ్ ఉండబోతుంది.

Similar News