యాషెస్ సిరీస్ షెడ్యూల్‌ను ప్రకటించిన ఇంగ్లాండ్ బోర్డు

2023 వేసవిలో ఇంగ్లాండ్ టీం క్రికెట్ షెడ్యూల్‌తో - England Cricket Board announces Ashes schedule

Update: 2022-09-22 10:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: 2023 వేసవిలో ఇంగ్లాండ్ టీం క్రికెట్ షెడ్యూల్‌తో బిజీబిజీగా ఉండనుంది. ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల యాషెస్ సిరీస్‌తో పాటుగా ఐర్లాండ్‌తో ఒక టెస్ట్ మ్యాచ్‌ ఆడనుంది. స్వదేశంలో జరిగే మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ఇంగ్లాండ్ ప్రకటించింది. బెన్ స్టోక్స్ కెప్టెన్సీలో ఇంగ్లాండ్ టెస్ట్ జట్టు జూన్ 1 నుంచి జూన్ 4 వరకు ఐర్లాండ్‌తో ఒక టెస్ట్ మ్యాచ్ లార్డ్స్‌లో ఆడుతుంది. 2021-2022లో ఆస్ట్రేలియాలో చేతిలో 0-4 తేడాతో యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్ జట్టు ఓడిపోయిన సంగతి తెలిసిందే. యాషెస్ సిరీస్‌లో భాగంగా టెస్ట్ మ్యాచ్‌లు.. ఎడ్జ్‌బాస్టన్, లార్డ్స్, హెడింగ్లీ, ఓల్డ్ ట్రాఫోర్డ్, ది ఓవల్‌ వేదికలుగా జూన్ 16 నుంచి జూలై 31 మధ్య జరుగుతాయి.


Similar News