వీరోచిత పోరాటం.. లెఫ్ట్ హ్యాండ్‌తో బ్యాటింగ్ చేసిన హనుమ విహారి (వీడియో వైరల్)
ఆంధ్ర కెప్టెన్ హనుమ విహారి గొప్ప పోరాటం ప్రదర్శించాడు.
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్ర కెప్టెన్ హనుమ విహారి గొప్ప పోరాటం ప్రదర్శించాడు. మధ్యప్రదేశ్‌తో రంజీ క్వార్టర్స్‌లో తొలి రోజు అవేశ్ బౌన్సర్ తగిలి అతని ఎడమ చేతి మణికట్టులో చీలిక వచ్చింది. దీంతో 16 పరుగుల వద్ద రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. అయితే చేతికి కట్టుతో ఉన్న అతను మళ్లీ బ్యాటింగ్‌కు రాడనే అనుకున్నారు. కానీ కీలకమైన క్వార్టర్స్ పోరు కావడం.. జట్టుకు వీలైనన్ని ఎక్కువ పరుగులు అందించాలనే ఉద్దేశంతో అతను రెండో రోజు 11 స్థానంలో క్రీజులోకి వచ్చాడు. కుడిచేతి వాటం బ్యాటరైన.. ఎడమచేతి బ్యాటర్‌గా మారి.. ఒక్క చేత్తోనే బ్యాటింగ్ కొనసాగించాడు. నొప్పి బాధిస్తున్నా జట్టు కోసం పోరాడాడు. 20 బంతులు ఎదుర్కొన్న అతను.. రెండు బౌండరీలూ కొట్టాడు.
అంతేకాదు ఆ ఒంటిచేత్తోనే అవేష్ ఖాన్ బౌలింగ్ లోనే ఓ ఫోర్ కూడా కొట్టడం విశేషం. తన స్కోరుకు మరో 11 పరుగులు జోడించి 27 రన్స్ దగ్గర చివరి వికెట్ గా వెనుదిరిగాడు. గాయంతోనూ విహారి బ్యాటింగ్ చేసిన తీరు చూసి నెటిజన్లు అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒంటిచేత్తో అతడు ఆడిన వీడియో వైరల్ గా మారింది. అసలు ధైర్యం అంటే విహారిదే అంటూ అతన్ని ఆకాశానికెత్తుతున్నారు.