2022 FIFA: దక్షిణ కొరియాపై విజయం.. క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్న బ్రెజిల్
ఫిఫా వరల్డ్‌కప్‌లో టైటిల్ పేవరేట్‌గా బరిలోకి దిగిన బ్రెజిల్ జట్టు విజయాలతో దూసుకుపోతోంది.
దిశ, వెబ్‌డెస్క్: ఫిఫా వరల్డ్‌కప్‌లో టైటిల్ పేవరేట్‌గా బరిలోకి దిగిన బ్రెజిల్ జట్టు విజయాలతో దూసుకుపోతోంది. దక్షిణ కొరియాతో జరిగిన మ్యాచ్‌లో బ్రెజిల్ ఘన విజయం సాధించింది. రౌండ్ ఆఫ్ 16లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో దక్షిణ కొరియాపై బ్రెజిల్ 4-1 తేడా విజయంతో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో బ్రెజిల్ తరుపున వినిసియస్ జూనియర్, నెయమర్, రిచర్లిసన్, లుకాస్ గోల్స్ చేశారు. ఇక విజయంతో ఎనిమిదోసారి ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్న జట్టుగా బ్రెజిల్ ఘనత సాధించింది. క్వార్టర్ ఫైనల్లో బ్రెజిల్, క్రొయేషియా మధ్య డిసెంబర్ 9న మ్యాచ్ జరుగనుంది.