షార్జా మాస్టర్స్ టోర్నీలో తెలంగాణ కుర్రాడు అర్జున్‌కు రెండో స్థానం

షార్జా మాస్టర్స్ చెస్ టోర్నీలో తెలంగాణ కుర్రాడు అర్జున్ ఇరిగేశి ఉమ్మడిగా రెండో స్థానంతో సరిపెట్టాడు.

Update: 2024-05-22 16:05 GMT

దిశ, స్పోర్ట్స్ : షార్జా మాస్టర్స్ చెస్ టోర్నీలో తెలంగాణ కుర్రాడు అర్జున్ ఇరిగేశి ఉమ్మడిగా రెండో స్థానంతో సరిపెట్టాడు. బుధవారం జరిగిన చివరిదైన 9వ రౌండ్‌లో అతను ఇరాన్ ప్లేయర్ బర్దియా దానేశ్వర్‌తో పాయింట్లు పంచుకున్నాడు. తెల్ల పావులతో ఆడిన అతను 48 ఎత్తుల్లో ప్రత్యర్థితో డ్రాకు అంగీకరించాడు. అర్జున్‌కు ఇది వరుసగా మూడో డ్రా. 9 రౌండ్లలో జరిగిన ఈ టోర్నీలో అర్జున్ నాలుగు విజయాలు, నాలుగు డ్రాలు, ఒక ఓటమితో మొత్తంగా 6.0 పాయింట్లతో ఉమ్మడిగా రెండో స్థానంలో నిలిచాడు. చివరి రౌండ్‌లో పి. ఇనియాన్, సేతరామన్, సమత్ ఆదిత్య, ప్రణవ్ ఆనంద్ సాధించారు. అభిమన్యు, అరవింద్ మధ్య, నిహాల్, ప్రణవ్ మధ్య జరిగిన గేమ్‌లు డ్రా అవ్వగా.. ఆదిత్య మిట్టల్, రౌనక్ సాధ్వాని కూడా పాయింట్లు పంచుకున్నారు. అర్జున్ తర్వాత అరవింద్, అభిమన్యు, ఇనియాన్ చెరో 5.5 పాయింట్లతో ఉమ్మడి మూడో స్థానంలో నిలిచారు. 

Tags:    

Similar News