ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్-2లో ఫైనల్‌కు జ్యోతి జట్టు

ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్-2లో తెలుగమ్మాయి, భారత స్టార్ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ కాంపౌండ్ మహిళల టీమ్ కేటగిరీలో ఫైనల్‌కు దూసుకెళ్లింది.

Update: 2024-05-22 17:14 GMT

దిశ, స్పోర్ట్స్ : సౌత్ కొరియాలో జరుగుతున్న ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్-2లో తెలుగమ్మాయి, భారత స్టార్ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ కాంపౌండ్ మహిళల టీమ్ కేటగిరీలో ఫైనల్‌కు దూసుకెళ్లింది. జ్యోతి, పర్ణీత్ కౌర్, అదితి గోపిచంద్ స్వామిలతో కూడిన భారత జట్టు స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది. బుధవారం జరిగిన సెమీస్‌లో జ్యోతి జట్టు 233-229 తేడాతో అమెరికా జట్టుపై విజయం సాధించింది. అంతకుముందు క్వార్టర్ ఫైనల్‌లో 236-234 తేడాతో ఇటలీని చిత్తు చేసింది. శనివారం జరిగే ఫైనల్‌లో భారత జట్టు వరల్డ్ నం.7 తుర్కియేతో తలపడనుంది. గత నెలలో స్టేజ్-1 టోర్నీలో భారత త్రయం గోల్డ్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే.

మరోవైపు, భారత పురుషుల కాంపౌండ్ జట్టు కాంస్య పతకాన్ని చేజార్చుకుంది. బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో ప్రియాన్షు, ప్రథమేశ్ బాలచంద్ర, అభిషేక్ వర్మలతో కూడిన భారత జట్టు ఆస్ట్రేలియా చేతిలో షూటౌట్‌లో పరాజయం పాలైంది. మొదట ఇరు జట్లు 133-133 స్కోరుతో నిలవడంతో మ్యాచ్ షూటౌట్‌కు వెళ్లింది. అక్కడ కూడా ఇరు జట్లు 10-10 స్కోరుతో నిలిచినప్పటికీ.. ఎక్స్ వద్ద సంధించిన ఆస్ట్రేలియాను విజేతగా ప్రకటించారు.  

Tags:    

Similar News