ఆర్సీబీపై అంబటి రాయుడు మరో సంచలన ట్వీట్

చెన్నైను ఓడించి ప్లేఆఫ్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకున్న ఆర్సీబీపై అంబటి రాయుడు వరుసగా సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్న విషయం తెలిసిందే.

Update: 2024-05-24 07:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: చెన్నైను ఓడించి ప్లేఆఫ్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకున్న ఆర్సీబీపై అంబటి రాయుడు వరుసగా సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆర్సీబీ ప్లేఆఫ్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమి పాలయ్యింది. ఇక, తాజాగా అంబటి రాయుడు ట్విట్టర్ వేదికగా ఆర్సీబీపై సంచలన ట్వీట్ చేశాడు. కొన్నేళ్లుగా ఆర్సీబీకి పాషనేట్‌గా సపోర్ట్ చేసిన ఫాన్స్ చుట్టూ తన హృదయం తిరుగుతుందన్నారు. సొంత మైల్‌స్టోన్స్ కన్నా మేనేజ్‌మెంట్, లీడర్లు టీమ్ ఇంట్రెస్ట్‌పై ఫోకస్ పెట్టాలని సూచించాడు. ఎంత మంది విలువైన ఆటగాళ్లు జట్టును వీడారో గుర్తుంచుకోవాలన్నాడు. ఆర్సీబీ మేనేజ్‌మెంట్‌ టీమ్ కోసం ఆడేవాళ్లను తీసుకురావాలని ఫోర్స్ చేయండి అంటూ ఫ్యాన్స్ కు పిలుపునిచ్చాడు. ఐపీఎల్ మెగా ఆక్షన్ ద్వారా కొత్త చాప్టర్‌ను ఆర్సీబీ ప్రారంభించాలని కాంక్షించారు.

Click Here For Twitter Post..

Similar News