ఇదే నా చివరి ప్రపంచ కప్.. Lionel Messi

స్టార్ ఫుట్ బాల్ ప్లేయర్ రిటైర్డ్ అవుతున్నారు అని గత కొంతకాలంగా అనేక పుకార్లు వచ్చాయి. కాగా వీటిపై ఎన్నడు స్పందించని మెస్సీ.. కీలక నిర్ణయం తీసుకున్నారు.

Update: 2022-12-14 04:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ ఫుట్ బాల్ ప్లేయర్ రిటైర్డ్ అవుతున్నారు అని గత కొంతకాలంగా అనేక పుకార్లు వచ్చాయి. కాగా వీటిపై ఎన్నడు స్పందించని మెస్సీ.. కీలక నిర్ణయం తీసుకున్నారు. 2022 ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ తన చివరి ప్రపంచ కప్ మ్యాచ్ అని స్పష్టం చేశారు. మెస్సీ ప్రస్తుతం అర్జెంటీనా కెప్టెన్ గా ఉన్నాడు. కాగా మెస్సీ ఆధ్వర్యంలో అర్జెంటీనా జట్టు ఫిఫా 2022 ఫైనల్ చేరుకుంది. ఈ క్రమంలోనే మెస్సీ ఇలా అన్నాడు. "నేను దీన్ని సాధించగలిగినందుకు, నా చివరి గేమ్‌ను ఫైనల్‌లో ఆడి నా ప్రపంచ కప్ ప్రయాణాన్ని ముగించినందుకు చాలా సంతోషంగా ఉంది. అని మెస్సీ చెప్పుకొచ్చాడు. దీంతో అతని అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

Also Read....

మెస్సీ మాయాజాలం.. ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్లో అర్జెంటీనా

Tags:    

Similar News