అష్టలక్ష్మి దేవాలయంలో సీఎం సతీమణి ప్రత్యేక పూజలు

దిశ, ఎల్బీనగర్ : అష్టలక్ష్మి దేవాలయంలో సీఎం కేసీఆర్ సతీమణి కల్వకుంట్ల శోభ ప్రత్యేక పూజలు చేశారు. శుక్రవారం ఉదయం కొత్తపేటలోని అష్టలక్ష్మి ఆలయానికి చేరుకున్న కేసీఆర్ సతీమణి శోభ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు దేవాలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి‌తో కలిసి వారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఆలయ కమిటీ నిర్వాహకులు, […]

Update: 2021-11-26 04:51 GMT

దిశ, ఎల్బీనగర్ : అష్టలక్ష్మి దేవాలయంలో సీఎం కేసీఆర్ సతీమణి కల్వకుంట్ల శోభ ప్రత్యేక పూజలు చేశారు. శుక్రవారం ఉదయం కొత్తపేటలోని అష్టలక్ష్మి ఆలయానికి చేరుకున్న కేసీఆర్ సతీమణి శోభ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు దేవాలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి‌తో కలిసి వారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఆలయ కమిటీ నిర్వాహకులు, పలువురు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:    

Similar News