కరోనా నివారణ కోసం ప్రత్యేక ఉద్యోగాలు

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా నివారణ చర్యల్లో భాగంగా అవసరమైన వైద్య సిబ్బందిని నియమించుకునేందుకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ దరఖాస్తులు కోరుతోంది. కోవిడ్ -19 చికిత్స కోసం కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసేందుకు ఆసక్తి గలవారు ఏప్రిల్ 3లోపు దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. స్పెషలిస్టుకు రూ.లక్ష, ఎంఓ (ఎంబీబీఎస్) రూ.40వేలు, ఎంఓ (ఆయూష్)కు రూ.35వేలు, స్టాఫ్ నర్స్ రూ. 23వేలు, ల్యాబ్ టెక్నీషియన్ రూ. 17 వేల వేతనం చెల్లిస్తారు. ఆయా విభాగాల్లో పదవి విరమణ పొందిన […]

Update: 2020-03-29 09:30 GMT

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా నివారణ చర్యల్లో భాగంగా అవసరమైన వైద్య సిబ్బందిని నియమించుకునేందుకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ దరఖాస్తులు కోరుతోంది. కోవిడ్ -19 చికిత్స కోసం కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసేందుకు ఆసక్తి గలవారు ఏప్రిల్ 3లోపు దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. స్పెషలిస్టుకు రూ.లక్ష, ఎంఓ (ఎంబీబీఎస్) రూ.40వేలు, ఎంఓ (ఆయూష్)కు రూ.35వేలు, స్టాఫ్ నర్స్ రూ. 23వేలు, ల్యాబ్ టెక్నీషియన్ రూ. 17 వేల వేతనం చెల్లిస్తారు. ఆయా విభాగాల్లో పదవి విరమణ పొందిన ప్రభుత్వ, ప్రైవేటు నిపుణులు ఎవరైనా దరఖాస్తులు చేసుకోవచ్చు. ఉద్యోగాల భర్తీ, వేతనం, ఆన్‌లైన్ దరఖాస్తు ఫారాల కోసం Health.telangana.gov.inలో పూర్తి వివరాలను పొందవచ్చు.

Tags: Special jobs, corona prevention, Retired employee, telangana

Tags:    

Similar News