ప్రజల సంరక్షణ బాధ్యత తీసుకోవడం గర్వకారణం

దిశ, మహబూబ్ నగర్: సమాజం విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రజలను సంరక్షించే బాధ్యత తీసుకోవడం గర్వకారణమని ఎస్పీ రెమా రాజేశ్వరి అన్నారు. కరోనా నియంత్రణకు విశేషంగా కృషి చేస్తున్న పోలీసు సిబ్బందికి మంగళవారం సుశ్రుత ఆస్పత్రి డాక్టర్ మధుసూదన్ రెడ్డి ఫేస్ మాస్కులు అందజేయగా ఎస్పీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒక్కసారిగా సమస్యలు చుట్టుముట్టినప్పుడు ఒకరికి మరొకరు సహకరించుకుంటూ విపత్తును ఎదుర్కోవాలని సూచించారు. ప్రస్తుత తరుణంలో పోలీసు సిబ్బంది చేస్తున్న కృషి […]

Update: 2020-05-05 06:29 GMT

దిశ, మహబూబ్ నగర్: సమాజం విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రజలను సంరక్షించే బాధ్యత తీసుకోవడం గర్వకారణమని ఎస్పీ రెమా రాజేశ్వరి అన్నారు. కరోనా నియంత్రణకు విశేషంగా కృషి చేస్తున్న పోలీసు సిబ్బందికి మంగళవారం సుశ్రుత ఆస్పత్రి డాక్టర్ మధుసూదన్ రెడ్డి ఫేస్ మాస్కులు అందజేయగా ఎస్పీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒక్కసారిగా సమస్యలు చుట్టుముట్టినప్పుడు ఒకరికి మరొకరు సహకరించుకుంటూ విపత్తును ఎదుర్కోవాలని సూచించారు. ప్రస్తుత తరుణంలో పోలీసు సిబ్బంది చేస్తున్న కృషి మరువ లేనిదన్నారు. తీవ్రమైన ఒత్తిడి ఉన్నా ప్రజలు అందిస్తున్న సహకారంతో ముందుకు వెళ్తున్నామన్నారు. జిల్లాలో కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు తాము చేపట్టిన చర్యలు ఫలితాన్ని ఇస్తున్నాయని, అదే విధంగా వైద్యులు సూచించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ కోరారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ లాక్‌డౌన్ నిబంధనలను పాటించాలన్నారు. ఈ సమావేశంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ రామ్మోహన్, ఇన్‌స్పెక్టర్లు అశోక్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Tags: people safety is different thing, in critical situation help each other, sp rema rajeshwari

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News