నక్సల్స్ ఏరివేతకు స్పెషల్ ఫోర్సెస్

దిశ, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలో మావోయిస్టులను ఏరివేసేందుకు అదనంగా రెండు స్పెషల్ పోలీస్ బలగాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ ఎన్. కోటిరెడ్డి తెలిపారు. జిల్లాలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నక్సల్ ప్రభావిత ప్రాంతాలను జల్లెడ పడుతూ ఎప్పటికప్పుడు వారి ఎత్తుగడలను తిప్పికొట్టడానికి పోలీస్ బలగాలు కూంబింగ్ చేస్తూనే ఉంటాయన్నారు. మావోయిస్టులు అభివృద్ధి నిరోధకులని, మళ్లీ తెలంగాణలో ప్రవేశించి హింసాత్మక చర్యలకు పూనుకోవడానికి ప్రయత్నిస్తున్నారని‌ వివరించారు. ఈ పరిస్థితుల్లో మావోయిస్టు ఆగడాలను […]

Update: 2020-07-21 08:37 GMT

దిశ, మహబూబాబాద్:
మహబూబాబాద్ జిల్లాలో మావోయిస్టులను ఏరివేసేందుకు అదనంగా రెండు స్పెషల్ పోలీస్ బలగాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ ఎన్. కోటిరెడ్డి తెలిపారు. జిల్లాలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నక్సల్ ప్రభావిత ప్రాంతాలను జల్లెడ పడుతూ ఎప్పటికప్పుడు వారి ఎత్తుగడలను తిప్పికొట్టడానికి పోలీస్ బలగాలు కూంబింగ్ చేస్తూనే ఉంటాయన్నారు. మావోయిస్టులు అభివృద్ధి నిరోధకులని, మళ్లీ తెలంగాణలో ప్రవేశించి హింసాత్మక చర్యలకు పూనుకోవడానికి ప్రయత్నిస్తున్నారని‌ వివరించారు. ఈ పరిస్థితుల్లో మావోయిస్టు ఆగడాలను తిప్పికొట్టడానికి పోలీస్ శాఖ అన్నివిధాలా సిద్ధంగా ఉందన్నారు. ఇన్ఫార్మర్ల నెపంతో హత్యలకు పాల్పడే మావోయిస్టులకు గడ్డుకాలం వచ్చిందన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ నరేష్ కుమార్, ఏ.ఆర్ డీఎస్పీ రెలా జనార్దన్ రెడ్డి, ఆర్.ఐ సురేష్, నరసయ్య, సీఐలు రాజయ్య, శ్రీనివాస్, సాగర్, సిబ్బంది పాల్గొన్నారు.

Tags:    

Similar News