ఇండియాలో కరోనా దీన గాథ.. (పాట)

అయ్యా నేనుండ ఇండియాలో అమ్మా నేనుండ ఇండియాలో ||అయ్యా నేనుండ|| చేయిచేయి కలపరాయే నమస్కారం అంటరాయే వంటింట్లో పోపులపెట్టె వంట్లోనే పెట్టుకు తిరుగుతరాయే ||అయ్యా నేనుండ|| మల్లగులాలు పడతారు, పరేషానొస్తే మేమోక్కటి అంటరాయే అడుగెట్టి ఎట్టగానే, మండలం దీక్ష బూని లాక్డౌన్ అంటరాయే ||అయ్యానేనుండ|| గీ డాక్టర్లు నర్స్ లు నన్ను పంపనీకి, 24గం’ దవాఖానాలోనే ఉంటరాయే||అయ్యా నేనుండ|| గీ పోలీసులు లాఠీలతో, కన్నీళ్లతో గస్తీ తిరుగుతుంటరాయే ||అయ్యా నేనుండ|| గీ సఫాయి కార్మికులు బ్లీచింగ్ తో […]

Update: 2020-04-17 06:26 GMT

అయ్యా నేనుండ ఇండియాలో
అమ్మా నేనుండ ఇండియాలో ||అయ్యా నేనుండ||

చేయిచేయి కలపరాయే
నమస్కారం అంటరాయే
వంటింట్లో పోపులపెట్టె
వంట్లోనే పెట్టుకు తిరుగుతరాయే ||అయ్యా నేనుండ||

మల్లగులాలు పడతారు,
పరేషానొస్తే మేమోక్కటి అంటరాయే
అడుగెట్టి ఎట్టగానే, మండలం దీక్ష బూని
లాక్డౌన్ అంటరాయే ||అయ్యానేనుండ||

గీ డాక్టర్లు నర్స్ లు నన్ను పంపనీకి,
24గం’ దవాఖానాలోనే ఉంటరాయే||అయ్యా నేనుండ||
గీ పోలీసులు లాఠీలతో, కన్నీళ్లతో
గస్తీ తిరుగుతుంటరాయే ||అయ్యా నేనుండ||

గీ సఫాయి కార్మికులు బ్లీచింగ్ తో
కళ్లాపి చల్లుతున్నరాయే ||అయ్యా నేనుండ||
గీ సర్కారోళ్లు దొరకబట్టి మరీ
క్వారంటైన్‌ లో వేస్తున్నారాయే ||అయ్యా నేనుండ||

గీ జనం చప్పట్లు కొట్టి దీపాలు పెట్టి
నన్ను పరేషాన్ చేస్తున్నారాయే ||అయ్యా నేనుండ||
గీ భయమెరుగని ఆడోళ్లు
అప్పడాలు, వడియాలు పెడుతున్నారాయే||అయ్యా నేనుండ||

గీ దేశం లో అందరు బావుండాలి
అందులో మేముండాలి అంటరాయే….
అయ్యా నేనుండ ఇండియాలో
అమ్మో నేనుండ ఇండియాలో ||అయ్యా నేనుండ||.

– రచన: రాయప్రోలు నాగలక్ష్మి, ఖమ్మం.

Tags: song on corona spreading in india, corona song, corona awareness song

Tags:    

Similar News