అటవీ సిబ్బందిపై స్మగ్లర్ల దాడి..

విధి నిర్వహణలో ఉన్న అటవీ అధికారులపై స్మగ్లర్లు దాడి చేసిన ఘటన నిర్మల్ జిల్లాలోని సోమారపుపేట బీట్‌లో చోటుచేసుకుంది. ఆ ప్రాంతంలో ఎందుకు సంచరిస్తున్నారని ప్రశ్నించినందుకు.. ఎఫ్ఆర్ఓ, ఖానాపూర్ అటవీ సిబ్బందిపై స్మగ్లర్లు రాళ్ళతో దాడి చేశారు. అయితే వారి నుంచి తృటిలో తప్పించుకున్న ఎఫ్ఆర్ఓ, సిబ్బంది.. మరికొంత సిబ్బందితో వెళ్లి ముగ్గురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకునే సమయంలో ఇరు వర్గాల మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ఎఫ్‌ఆర్‌ఓ సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. […]

Update: 2020-04-26 11:33 GMT

విధి నిర్వహణలో ఉన్న అటవీ అధికారులపై స్మగ్లర్లు దాడి చేసిన ఘటన నిర్మల్ జిల్లాలోని సోమారపుపేట బీట్‌లో చోటుచేసుకుంది. ఆ ప్రాంతంలో ఎందుకు సంచరిస్తున్నారని ప్రశ్నించినందుకు.. ఎఫ్ఆర్ఓ, ఖానాపూర్ అటవీ సిబ్బందిపై స్మగ్లర్లు రాళ్ళతో దాడి చేశారు. అయితే వారి నుంచి తృటిలో తప్పించుకున్న ఎఫ్ఆర్ఓ, సిబ్బంది.. మరికొంత సిబ్బందితో వెళ్లి ముగ్గురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకునే సమయంలో ఇరు వర్గాల మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ఎఫ్‌ఆర్‌ఓ సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. కాగా, మరో ముగ్గురు అక్రమ కలప రవాణా కూలీలు పరారయ్యారు. ఈ ఘటనపై ఖానాపూర్ ఎఫ్‌ఆర్ఓ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Tags : Forest officers, FRO, Khanapur, Smugglers, attack

Tags:    

Similar News