వైజాగ్ మున్సిపాలిటీలో 8,440 ఇళ్లు రద్దు

దిశ, ఏపీ బ్యూరో: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గత ప్రభుత్వ హయాంలో నిర్మించతలపెట్టిన 8,440 ఇళ్లను ప్రభుత్వం రద్దు చేసింది. గత ప్రభుత్వ హయాంలో విశాఖనగరానికి 27,000 ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో ఎక్కువ శాతం ఇళ్ల స్లాబులు పూర్తి చేయగా, మరికొన్ని నిర్మాణాలు పూర్తయ్యాయి. ఐదు మురికివాడల్లో 8,440 ఇళ్ల నిర్మాణానికి పునాదులు మాత్రమే వేశారు. అయితే లబ్దిదారుల ఎంపిక పూర్తి చేసి, ఇళ్ల కేటాయింపు కూడా జరిగింది. ఈ 8,440 ఇళ్ల నిర్మాణం […]

Update: 2020-07-02 01:34 GMT

దిశ, ఏపీ బ్యూరో: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గత ప్రభుత్వ హయాంలో నిర్మించతలపెట్టిన 8,440 ఇళ్లను ప్రభుత్వం రద్దు చేసింది. గత ప్రభుత్వ హయాంలో విశాఖనగరానికి 27,000 ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో ఎక్కువ శాతం ఇళ్ల స్లాబులు పూర్తి చేయగా, మరికొన్ని నిర్మాణాలు పూర్తయ్యాయి. ఐదు మురికివాడల్లో 8,440 ఇళ్ల నిర్మాణానికి పునాదులు మాత్రమే వేశారు. అయితే లబ్దిదారుల ఎంపిక పూర్తి చేసి, ఇళ్ల కేటాయింపు కూడా జరిగింది. ఈ 8,440 ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేందుకు చాలా సమయం పడుతుందని భావించిన ప్రభుత్వం వీటిని రద్దు చేసి, వీటి స్థానంలో ఇళ్ల పట్టాలు అందజేయాలని నిర్ణయించింది.

Tags:    

Similar News