ఎస్‌ఆర్ నగర్‌లో ACB రైడ్స్.. పట్టుబడిన ఎస్సై!

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ మహానగరంలోని ఎస్‌ఆర్ నగర్‌లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ రైడ్స్‌లో ఎస్సార్‌నగర్ పోలీస్‌స్టేషన్ సబ్‌ ఇన్‌స్పెక్టర్ భాస్కర్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యండెడ్‌గా పట్టుబడినట్లు తెలుస్తోంది. సివిల్ సప్లయ్ డిపార్ట్మెంట్ అధికారులు ఎస్సార్ నగర్ పీఎస్‌లో మహ్మద్ ఖాసీం అనే డ్రైవర్ పై క్రిమినల్ కేసు నమోదు చేశారు. దీంతో అధికారులను ప్రభావితం చేసి సీజ్ అయిన వాహనాన్ని విడిపించడానికి మహ్మద్ ఖాసీంను ఎస్సై భాస్కర్ రూ.25 వేలు లంచం […]

Update: 2021-02-22 08:45 GMT

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ మహానగరంలోని ఎస్‌ఆర్ నగర్‌లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ రైడ్స్‌లో ఎస్సార్‌నగర్ పోలీస్‌స్టేషన్ సబ్‌ ఇన్‌స్పెక్టర్ భాస్కర్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యండెడ్‌గా పట్టుబడినట్లు తెలుస్తోంది.

సివిల్ సప్లయ్ డిపార్ట్మెంట్ అధికారులు ఎస్సార్ నగర్ పీఎస్‌లో మహ్మద్ ఖాసీం అనే డ్రైవర్ పై క్రిమినల్ కేసు నమోదు చేశారు. దీంతో అధికారులను ప్రభావితం చేసి సీజ్ అయిన వాహనాన్ని విడిపించడానికి మహ్మద్ ఖాసీంను ఎస్సై భాస్కర్ రూ.25 వేలు లంచం అడిగాడు. దీంతో బాధిత వ్యక్తి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. సోమవారం సాయంత్రం 6.20 గంటల సమయంలో స్టేషన్లో లంచం తీసుకుంటుండగా హైదరాబాద్ రేంజ్ ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో హాజరుపర్చగా.. జడ్జి ఉత్తర్వుల మేరకు రిమాండ్‌కు తరలించారు.

 

Tags:    

Similar News