ఆ విషయం ఇప్పుడే చెప్పలేనంటున్న శృతి

హీరోయిన్ శృతిహాసన్ ఇన్‌స్టాగ్రామ్‌లో 14 మిలియన్ల ఫాలోవర్స్‌ను సొంతం చేసుకుని ఫుల్ హ్యాపీగా ఉంది. ఈ సందర్భంగా అభిమానులతో చిట్ చాట్‌లో పాల్గొన్న శృతి.. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చింది. గబ్బర్‌సింగ్ సినిమాతో పవర్‌స్టార్ పవన్‌ కళ్యాణ్‌కు తగిన జోడీ అనిపించుకున్న ఈ భామ.. ఆ తర్వాత ‘కాటమరాయుడు’లోనూ తనతో జతకట్టింది. దీంతో పవన్ గురించి మీ అభిప్రాయం ఏంటని? అభిమానులు కోరగా.. ‘పవన్ ఒక అద్భుతమని, మంచి మనసున్న గొప్ప వ్యక్తి అని’ కితాబిచ్చింది. మరి […]

Update: 2020-06-11 00:45 GMT

హీరోయిన్ శృతిహాసన్ ఇన్‌స్టాగ్రామ్‌లో 14 మిలియన్ల ఫాలోవర్స్‌ను సొంతం చేసుకుని ఫుల్ హ్యాపీగా ఉంది. ఈ సందర్భంగా అభిమానులతో చిట్ చాట్‌లో పాల్గొన్న శృతి.. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చింది. గబ్బర్‌సింగ్ సినిమాతో పవర్‌స్టార్ పవన్‌ కళ్యాణ్‌కు తగిన జోడీ అనిపించుకున్న ఈ భామ.. ఆ తర్వాత ‘కాటమరాయుడు’లోనూ తనతో జతకట్టింది. దీంతో పవన్ గురించి మీ అభిప్రాయం ఏంటని? అభిమానులు కోరగా.. ‘పవన్ ఒక అద్భుతమని, మంచి మనసున్న గొప్ప వ్యక్తి అని’ కితాబిచ్చింది. మరి వకీల్ సాబ్‌లో మూడోసారి పవన్‌తో జతకట్టబోతున్నారని వార్తలు వస్తున్నాయి.. ఇది నిజమేనా అని ప్రశ్నించగా.. ఆ విషయం ఇప్పుడే చెప్పలేనని సమాధానమిచ్చింది. ఇక మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? పెళ్లి అయిందా? అన్న ప్రశ్నకు.. నాకు బాయ్ ఫ్రెండ్ లేడు. పెళ్లి కూడా కాలేదని చెప్పింది శృతి.

Tags:    

Similar News